స్త్రీ స్నానం చేస్తుండగా దొంగచాటుగా వీడియో చిత్రీకరణ
హైదరాబాద్: బాత్రూంలో స్నానం చేస్తున్న ఓ మహిళను వీడియో తీసిన వ్యక్తిని హైదరాబాదులోని బంజరాహిల్స్ పోలీసులు అఅరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 12లో గల సయ్యద్‌నగర్‌లో రవూఫ్ అనే వ్యక్తి స్నానం చేస్తున్న మహిళను వీడియోలో చిత్రీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.
31 ఏళ్ల రవూఫ్ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. మంగళవారంనాడు అతను బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లో ఓ అపార్టుమెంటులో పనిచేసేందుకు వెళ్లాడు. పని చేస్తూనే అదే అపార్టుమెంటులోని బాత్రూంలో స్నానం చేస్తున్న మహిళ (24)ను దొంగచాటుగా తన సెల్ ద్వారా చిత్రీకరించాడు.

అతడు చిత్రీకరణ చేస్తుండగా అప్పుడే బయట నుంచి వచ్చిన మరో మహిళ ఈ విషయాన్ని గమనించి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. ఆ సమయంలో దాన్ని గమనించి రవూఫ్ పరారయ్యాడు. ఈ సంఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడ్ని బుధవారం అరెస్టు చేశారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications