మరో వీడియో షేర్ చేసిన మంచు మనోజ్!

అన్నదమ్ములు, తెలుగు సినీరంగంలో కథానాయకులైన మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య వివాదం నడుస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వ్యక్తులపై ఎలాంటి దౌర్జన్యం చేస్తాడో చూడండంటూ మనోజ్ ఇటీవలే ఒక వీడియోను షేర్ చేశారు. దీనిపై మోహన్ బాబు తనయులిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు వీడియోను డిలిట్ చేయాలని మనోజ్ ను ఆదేశించడంతో ఆ వీడియోను మనోజ్ తొలగించారు. తాజాగా మరో వీడియోను మనోజ్ షేర్ చేశారు. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికను మనోజ్ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

వారిద్దరి వివాహమై నెలరోజులవుతున్న సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లోని స్టోరీస్ లో షేర్ చేశారు. తన భార్య మౌనికతో ఉన్న వీడియోను షేర్ చేస్తూ ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు అంటూ క్యాప్షన్ పెట్టారు. అభిమానులంతా మనోజ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వివాహ జీవితం ఎటువంటి ఇబ్బందులకు గురవకుండా సాగాలని కోరుకుంటున్నారు.

manchu manoj

తమకు బంధువు, తన మనిషి అయిన వ్యక్తిపై ఎలా దాడి చేస్తున్నారో చూడండంటూ ఒక వీడియోను మనోజ్ షేర్ చేశారు. దీంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ వీడియో వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మంచు లక్ష్మీ కూడా తాను ఆ వీడియోను చూడలేదని, ఒకసారి తెలుసుకుంటానని మీడియాకు చెప్పారు. క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబు పిల్లలే ఇలా క్రమశిక్షణ తప్పితే ఎలా అంటూ వార్తలు వచ్చాయి. వీడియో పెట్టిన కొద్దిసేపటికి దాన్ని మనోజ్ తొలగించినప్పటికీ అన్నదమ్ములిద్దరికీ సఖ్యత లేదని, వివాదం నడుస్తోందంటూ చర్చ సాగింది. అయితే మోహన్ బాబు ఆదేశాలతో మనోజ్ ఆ వీడియోను తొలగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+