కొడుకులు, కుమార్తెకు మోహన్ బాబు ఆస్తి పంపకాలు
మంచు మోహన్ బాబు తన వారసులకు ఆస్తిని పంచినట్లు తెలుస్తోంది. ఎవరికి రావల్సిన వాటాలను వారికిచ్చేశారని తెలుస్తోంది. ఈ విషయం నిజమేనని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందినవారు వ్యాఖ్యానిస్తున్నారు. రిజిస్ట్రేషన్ పనిమీద మోహన్ బాబు షాద్ నగర్ వెళ్లిన సంగతి తెలిసిందే. కార్యాలయం దగ్గర మోహన్ బాబును టీవీ ఛానళ్ల ప్రతినిధులు చుట్టుముడితే వారిమీద ఆయన ఫైరయ్యారు.
బుద్ధి లేదా మీకు.. మీ ఉద్యోగాలు ఊడబీకుతా.. అంటూ వారిమీద నిప్పులు చెరిగారు. ఇలా మీడియా ప్రతినిధులమీద ఫైర్ అవడమనేది మోహన్ బాబు కావాలనే చేశారంటున్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలా చేశారంటున్నారు. తన కుమారుడు, కుమార్తెకు ఆస్తిని పంచారని తెలుస్తోంది. గతంలోనే ఆయన తన ఆస్తుల్ని ముగ్గురు పిల్లలకు రాసిచ్చారు. ఫిల్మ్‌నగర్‌లో మోహన్ బాబుకి ఓ ఇల్లు ఉంది. అది కుమార్తె మంచు లక్ష్మికి రాసిచ్చారు.

తిరుపతిలో ఉన్న ఆస్తుల్ని విష్ణుకి, హైదరాబాద్ శివార్లలో ఉన్న ఫ్లాటుని మనోజ్ కి రాసిచ్చారు. అప్పటికీ మోహన్ బాబు పేరుమీద మరికొన్ని ఆస్తులు మిగిలాయి. వాటిని ఇప్పుడు క్లియర్ చేశారు. కొద్దిరోజుల క్రితం విష్ణు, మనోజ్ మధ్య వివాదం రేకెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మనోజ్ మీడియాకు స్వయంగా కొన్ని లీకులందించారు. ఈ విషయాన్ని రియాలిటీ షో అంటూ కప్పి పుచ్చడానికి చూశారుకానీ వీరిద్దరి మధ్య రాజీ కుదర్లేదు. ఆ వివాదాలవల్లే ప్రస్తుతం మోహన్ బాబు తన వారసులకు ఆస్తి పంచి ఫైనల్ సెటిల్‌మెంట్ చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications