మంచు విష్ణుకు మనోజ్ పెళ్లి ఇష్టంలేదా? అందుకేనా?
మంచు మనోజ్, భూమా మౌనికరెడ్డి పెళ్లిలో మంచు విష్ణు, విరానికలు కనిపించలేదు.
మంచు మనోజ్, భూమా మౌనికరెడ్డి పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. ఫిల్మ్ నగర్‌లోని నివాసంలోనే ఈ వివాహం జరగ్గా అతి కొద్ది మంది బంధుమిత్రులే హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో మంచు మనోజ్ అన్నయ్య మంచు విష్ణు ఎక్కడా కనిపించలేదు. ఆయన అలా వచ్చి ఇలా వెళ్లినట్లుగా తెలుస్తోంది. విష్ణుకానీ, ఆయన సతీమణి విరానిక కానీ, వారి పిల్లల సందడికానీ వివాహం జరిగేచోట ఎక్కడా కనిపించలేదు.
కానీ మంచు మనోజ్, భూమా మౌనికరెడ్డి పెళ్లిలో మంచు విష్ణు, విరానికలు కనిపించలేదు. అరియానా, వివియానాల సందడి లేదు. అవ్రామ్ కూడా లేడు. మంచు లక్ష్మీ మాత్రం ఈ పెళ్లిని తన భుజాల మీద నడిపించినట్టుగా కనిపిస్తోంది. అక్కా తమ్ముళ్ల బంధం కూడా ప్రజలందరికీ అర్థమైంది. తన అక్కమీద అంత ప్రేమను కురిపించడానికి ఏ జన్మ పుణ్యం చేసుకున్నాడో మనోజ్ అంటూ వార్తలు వచ్చాయి. మంచు లక్ష్మీ అయితే తన తమ్ముడి పెళ్లిఫొటోలను షేర్ చేస్తూ సంబరాల్లో మునిగిపోయింది. అయితే మంచు విష్ణు ఉన్నట్లుగా ఫొటోలను షేర్ చేయలేదు. వివాహం మీద అసలు రియాక్టవడంలేదు. విష్ణుకు ఈ పెళ్లి అంతగా ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది.

మంచు విష్ణు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటాడు. అలాంటిది తన తమ్ముడి వివాహం గురించిన పోస్ట్ కానీ, ఫొటో కానీ షేర్ చేయకపోవడం ఏమిటనే చర్చ ఫిలింనగర్ లో జరుగుతోంది. ఏమైనా రాజకీయాలున్నాయా? చిన్న చిన్న విషయాలమీదే తరుచుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేయడం, ట్వీట్ చేయడంకానీ జరగలేదు ఎందుకు అని? అయితే మంచు విష్ణు, మనోజ్ మధ్య ఏదో గ్యాప్ వచ్చినట్లుగా ఇన్ని సంవత్సరాల నుంచి వస్తోన్న రూమర్లు మరోసారి తెరపైకి రావడంతో మంచు వారంతా వేర్వేరు ఇళ్లల్లో ఉంటారన్న విషయం తెలిసిందే. విభేదాలు బయటపడ్డాయని చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications