కెసిఆర్ శత్రువే: మందకృష్ణ, బాబు, కిషన్‌కు థ్యాంక్స్

దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని పదేళ్లుగా కెసిఆర్ ప్రచారం చేసి తెలంగాణ రాగానే ఆ ఊసెత్తడం లేదని విమర్శించారు. పరకాల ఎమ్మెల్యే బిసి వ్యక్తి మొలుగూరి భిక్షపతి సిట్టింగ్ స్థానంలో ఉన్నప్పటికీ మొండిచేయి చూపి అక్కడి స్థానాన్ని కొండా సురేఖకు కేటాయించారని ఆరోపించారు. ఓటమి సీటైన హుజూర్‌నగర్‌లో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను నిలబెట్టి కెసిఆర్ త్యాగధనులను గెలిపించాలనడం సరికాదన్నారు. టిడిపి, భారతీయ జనతా పార్టీ నుంచి మద్దతు తెలిపినందుకు ఆ పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, కిషన్‌రెడ్డిని త్వరలో కలిసి ధన్యవాదాలు తెలుపుతానని చెప్పారు.
తనకు సహకరించిన దయాకర్‌రావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపేందుకు కడవెండికి వచ్చానని మందకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులకు కాకుండా ఎమ్మెల్యే, ఎంపి సీట్ల టిక్కెట్లను కోట్లాది రూపాయలకు కెసిర్ అమ్ముకున్నారని ఆరోపించారు. మహారాష్ట్రకు చెందిన బాబ్లీ ప్రాజెక్టు బడా కాంట్రాక్టర్‌కు జహీరాబాద్ టికెట్, కొండా మురళీధర్‌రావుకు టికెట్‌లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
మహబూబాబాద్ కాల్పుల ఘటనకు బాధ్యులై, తెలంగాణ విద్యార్థులపై కేసులు పెట్టించిన ద్రోహిని పార్టీలో చేర్చుకోవడమేకాక టిక్కెట్ అమ్ముకుని మంత్రి పదవి ఇస్తాననడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ ప్రజలు, మేధావులు, ఉద్యమకారులు, కళాకారులు అంతా గమనిస్తున్నారని, ఈఎన్నికల్లో కెసిఆర్‌కు తగిన బుద్ధి చెబుతారని ఎర్రబెల్లి అన్నారు. పేద వర్గాల కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగను టిడిపి, బిజెపి మద్దతుతో వర్ధన్నపేట నుంచి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications