మంగళగిరి వైసీపీ ఇంఛార్జ్‌గా బీసీ నేత- ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా అందుకేనా..?
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆయన స్పీకర్ కు రాజీనామా లేఖ పంపారు. మంగళగిరి వైసీపీ ఇంఛార్జ్‌గా బీసీ సామాజికవర్గానికి చెందిన నేతను నియమిస్తుండడంతో ఆర్కే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈసారి టికెట్ రాదనే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ పై విజయం సాధించారు.ఆళ్ల రామకృష్ణా రెడ్డి 2014లో తొలిసారి ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి ఆశించినా సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కలేదు.

అప్పటి నుంచి కాస్త అలకబూనినట్లు తెలుస్తోంది. మరోవైపు మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే రేసులో కాండ్రు కమల కూడా ఉన్నారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు ఆళ్ల రామకృష్ణ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రానికి మంగళగిరికి కొత్త ఇంఛార్జ్‌ను వైసీపీ ప్రకటిస్తుందని సమాచారం. ఏది ఏమైనప్పటికీ మరికొన్ని నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజధాని ప్రాంతంలో కీలకమైన ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం చర్చనీయంశంగా మారింది.












Click it and Unblock the Notifications