ఆర్కే ఇంటికి గంజి చిరంజీవి - అక్కడే అసలు ట్విస్ట్..!!

వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు కొత్త సమీకరణాలకు కారణమవుతోంది. టీడీపీ నేత నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్దిగా గంజి చిరంజీవి పేరు దాదాపు ఖరారైంది. ఈ ప్రకటనకు ముందే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేసారు. దీంతో..కలకలం మొదలైంది. ఆ తరువాత పార్టీ ముఖ్య నేతలు మాత్రం ఆళ్ల పార్టీని వీడరని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా గంజి చిరంజీవి ఎమ్మెల్యే ఆర్కే నివాసానికి వెళ్లారు.

అభ్యర్దుల ఎంపిక : సీఎం జగన్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్దుల ఎంపిక కసరత్తు ప్రారంభించారు. అవసరమైన నియోజకవర్గాల్లో అభ్యర్దులను మార్పు చేస్తున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను మార్పు చేసారు. మరిన్ని నియోజకవర్గాల్లో మార్పు ఖాయమని చెబుతున్నారు. ఈ మార్పుల వేళ పార్టీలో కీలకంగా వ్యవహరించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన పదవికి రాజీనామా చేసారు. మంగళగిరి ఇంఛార్జ్ గా గంజి చిరంజీవి పేరు ఖరారు కావటంతో ఆయన రాజీనామా చేసారు. కానీ, చిరంజీవిని నియిమించిన కారణంగా తాను రాజీనామా చేసినట్లు చెప్పలేదు. వైఎస్సార్ మరణం నుంచి తాను జగన్ తో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

Mangalagiri YCP incharge change leads to new controversy, RK to take key decision

ఆర్కే రాజీనామాతో : ఆ తరువాత రాజ్యసభ సభ్యుడు ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి ఆర్కే రాజీనామా పైన స్పందించారు. ఆర్కే పార్టీని వీడరని చెప్పుకొచ్చారు. ఇక..వచ్చే ఎన్నికల్లో బీసీలకు సీట్లు పెంచాలని సీఎం జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా చేనేత వర్గానికి చెందిన గంజి చిరంజీవిని మంగళగిరి నుంచి బరిలోకి దింపాలనే నిర్ణయానికి వచ్చారు. గతంలో గంజి చిరంజీవి టీడీపీ నుంచి పోటీ చేసారు. నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఆర్కేతో చర్చల తరువాతనే గంజి చిరంజీవి పార్టీలో చేరిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా గంజి చిరంజీవి ఎమ్మెల్యే ఆర్కే ఇంటికి వెళ్లారు.

గంజి కలిసే ప్రయత్నం : గంజి చిరంజీవితో కలిసేందుకు ఆర్కే సుముఖత వ్యక్తం చేయలేదు. దాదాపు గంట సేపు గంజి చిరంజీవి అక్కడే నిరీక్షించారని తెలుస్తోంది. కానీ, ఆర్కే కలవ లేదు. మరో వైపు ఆర్కే తన మద్దతు దారులు..అనుచరులతో సమావేశం కానున్నారు. రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది వారితో చర్చించిన తరువాత ప్రకటిస్తారని చెబుతున్నారు. రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన నియోజకవర్గం కావటంతో వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఇక..ఇప్పుడు ఆర్కే విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఆర్కే మనసు మార్చుకొని సహకరిస్తారా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+