మాన్సాస్ వివాదం.. ఏడాది నుండి కోడిగుడ్డు మీద ఈకలు పీకారా : సాయిరెడ్డికి వెలగపూడి కౌంటర్
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టిడిపి నాయకుడు మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఒక దొంగ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన వల్లనే పంచ గ్రామాల్లో భూ సమస్య వచ్చిందని ఆరోపణలు గుప్పించారు. దొడ్డిదారిన అశోక్ గజపతి రాజు మళ్లీ సింహాచల దేవస్థానం చైర్మన్ అయ్యారని విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

విజయసాయి రెడ్డిపై మండిపడిన వెలగపూడి రామకృష్ణబాబు
మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచైత నియామకం చెల్లదంటూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో దీనిపై డివిజన్ బెంచ్ కి అప్పీల్ కి వెళ్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడంపై వెలగపూడి రామకృష్ణబాబు మండిపడ్డారు. అశోక్ గజపతిరాజును దొంగని వ్యాఖ్యానించడంపై విరుచుకుపడిన వెలగపూడి రామకృష్ణబాబు16 నెలలు జైల్లో ఉండి వచ్చిన నీవెక్కడ? పుట్టుకతోనే రాజవంశీయుడు అయిన అశోక్ గజపతిరాజు ఎక్కడ అంటూ ఫైర్ అయ్యారు.

ఏడాదిగా కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారా ?
మాన్సాస్ లో అక్రమాలు జరిగాయని విజయసాయి అంటున్నాడని పేర్కొన్న వెలగపూడి నువ్వు నియమించిన తొత్తే కదా మాన్సాస్ చైర్ పర్సన్ గా ఏడాది కాలంగా ఉంది అంటూ మండిపడ్డారు. సంచయిత చైర్ పర్సన్ గా ఉన్న సమయంలో అక్రమాలు నీకు కనబడలేదా అంటూ ప్రశ్నించిన వెలగపూడి రామకృష్ణబాబు ఏడాదిగా కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
Recommended Video

అశోక్ గజపతిరాజుపై విజయసాయి తీవ్ర ఆరోపణలు
ఇక మాన్సాస్ ట్రస్ట్ భూముల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉండగా 2016లో ప్రభుత్వం నుంచి ఒక దొంగ జీవో తీసుకొచ్చి 115 ఎకరాలను చట్టవిరుద్ధంగా అమ్మేశారని పేర్కొన్నారు. 2010లోనే 500 ఎకరాలకు పైగా కాజేశారని , వీటన్నిటి పైన విచారణ జరిపిస్తామని తెలిపారు. సింహాచల ఆలయ భూములకు సంబంధించి దశాబ్దాలుగా ఉన్న పంచ గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రధాన పాదయాత్ర సమయంలో మాట ఇచ్చారని ఆ మాటకు కట్టుబడి పని చేస్తామని వెల్లడించారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications