Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ నుంచి రాయలసీమ వరకు చంద్రబాబుకు చిక్కులెన్నో!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రోజుకో చిక్కు వచ్చి పడుతోన్నట్లుగా కనిపిస్తోంది. విభజన ఎఫెక్ట్ నుంచి మొదలు ఇప్పుడు ప్రత్యేక హోదా వరకు వివిధ రకాలుగా కష్టాలు వస్తున్నాయి. రేపు రాయలసీమ కోసం ఉద్యమం వచ్చే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైనవి చాలానే ఉన్నాయి. అయితే, పలు కొత్త చిక్కులు ఆయనకు ఇబ్బందులు తీసుకు వస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలుగు రాష్ట్రాల మధ్య పలు అంశాలపై విభేదాలు కనిపిస్తున్నాయి. ఓటుకు నోటు వ్యవహారం, గోదావరి పుష్కరాల్లో 27 మంది మృతి, హుధుద్ తుఫాను... ఇలా వరుసగా కష్టాలు, సమస్యలు వచ్చిపడుతున్నాయి.

అయితే, చంద్రబాబు ముందు మరిన్ని సమస్యలు రావడం లేదా ఉధృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.

Many issues in front of AP CM Chandrababu Naidu

రాజధాని నిర్మాణంతో...

రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం భూసేకరణ చేసింది. గుంటూరు ప్రాంతంలో రాజధాని నిర్మాణాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. రాష్ట్రానికి మధ్యలో ఉండటం వల్లనే దానిని ఎంపిక చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే భూసేకరణ పైన విపక్షాలు భగ్గుమన్నాయి.

రేపు భవిష్యత్తులో భూమి ఇచ్చిన రైతులకు న్యాయం జరగకపోయినా, అనుకున్నంత వేగంగా రాజధాని నిర్మాణం జరగకపోయినా విపక్షలు దానిని ఆయుధాంగా మార్చుకునే అవకాశాలున్నాయి. అలాగే, రాజధాని ప్రాంతం భూకంపం ఏరియలో ఉందనే వాదనలు ఉన్నాయి.

రాజధాని నిర్మాణం విషయంలో.. భూసేకరణ, సింగపూర్ విదేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం, రాజధాని నిర్మాణ బాధ్యతల అప్పగింత, భూమిలిచ్చిన రైతులకు సంతృప్తికరరీతిలో న్యాయం చేయడం... ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి.

ప్రత్యేక హోదా ఉధృతమే..

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రోజు రోజుకు ఉద్యమం ఊపందుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. మునికోటి ఆత్మహత్య తర్వాత హోదా కోసం ఉద్యమం ఏమాత్రం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. బిజెపి - టిడిపి పైన విపక్షాలు ఏకతాటి పైకి వస్తున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలిసి పోరాడాలని వామపక్షాలు, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదేపదే చెబుతున్నారు. హోదా విషయంలో బిజెపి స్ట్రాటెజీ ఆ పార్టీకి ఉండవచ్చు. కానీ దీనిపై చంద్రబాబును నిలదీస్తున్నారు.

బీహార్ ఎన్నికల తర్వాత ఇవ్వడం లేదా ఆ స్థాయిలో ఆర్థిక సాయం చేయడం కేంద్రం చేసే అవకాశాలున్నాయి. కానీ హోదా ఆలస్యంగా ఇచ్చినా, హోదా కాకుండా ఆ స్థాయిలో అంతకుమించి ఆర్థిక సాయం చేసినా చంద్రబాబును విపక్షాలు నిలదీస్తాయి.

రాజధాని రగడ...

తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు నాడు డిమాండ్ చేశారు. ఇప్పుడు రాజధాని అమరావతిలో ఏర్పాటు చేశారు. అయితే, కనీసం తమకు రెండో రాజధాని అయినా ఇవ్వాలని రాయలసీమ ప్రాంత నేతలు డిమాండ్ చేస్తున్నారు.

సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు.. రాజధాని హైదరాబాద్ కేంద్రమే ఎక్కువ అభివృద్ధి చెందింది. ఇప్పుడు చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా పాటు.... తమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాజధాని గుంటూరులో ఏర్పాటు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణలో తమకు అన్యాయం జరిగితే ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి పలువురు సిద్ధంగా ఉన్నారనే చెప్పవచ్చు.

విభజనతో మొదలు... ఆర్థిక లోటు

అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజనతోనే కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. విభజన నేపథ్యంలో ఏపీ భారీ ఆర్థిక లోటులో కూరుకుపోయింది. ప్రస్తుతం తొంబైవేల కోట్ల రూపాయల వరకు అప్పులో ఉంది. కేంద్రం ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే గానీ ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంతో పలు సమస్యలు ఇంకా కొలిక్కి రాలేదు. ఉద్యోగుల నుంచి నీళ్ల వరకు గొడవ కొనసాగుతోంది.

హైదరాబాద్ నుంచి పాలన...

హైదరాబాద్ నుంచి ఏపీ పాలన పైన చంద్రబాబు మీద విపక్షాలు మండిపడుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా రాజధానికి రావాలని, ఇక్కడి నుంచే పాలించాలని చెబుతున్నాయి. అయితే, ప్రభుత్వం మొత్తం హైదరాబాద్ నుంచి ఏకబిగిన తరలిపోవడం, ఉద్యోగులకు మౌలిక సదుపాయాలు.. ఇవన్నీ ఇబ్బందికరమే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+