అప్పటిదాకా ప్రశాంతంగా నారాయణ.. ఒక్కసారిగా..: నిషిత్ పేరిట ట్రస్ట్
ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ అంత్యక్రియలకు పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు, స్నేహితులు తరలి వచ్చారు. తొలుత తనయుడి మృతదేహాన్ని చూసి తల్లడిల్లి,
నెల్లూరు: ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ అంత్యక్రియలకు పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు, స్నేహితులు తరలి వచ్చారు. తొలుత తనయుడి మృతదేహాన్ని చూసి తల్లడిల్లి, కంటతడి పెట్టిన తండ్రి నారాయణ ఆ తర్వాత కొంత సర్దుకున్నారు.
ఒక్కగానొక్క కొడుకు మృతి చెందినప్పుడు తానే ఏడుస్తూ ఉంటే కుటుంబం సభ్యుల పరిస్థితి ఏమిటని ఆలోచించారు. వారిని ఊరడించేందుకు ఆయన తనకు తాను సర్ది చెప్పుకున్నారు. అంతిమయాత్ర పూర్తయ్యేదాకా బాధను మనసులోనే దాచుకున్నారు. ఆ తర్వాత తన బాధను ఆపుకోలేకపోయారు. కంటతడి పెట్టారు

కూతురు వద్దకు వెళ్లి..
తానే బాధపడి కూర్చుంటే మిగతా ఫ్యామిలీ అంతా మరింత డిప్రెషన్‌కు గురవుతుందని నారాయణ భావించారని సన్నిహితులు చెబుతున్నారు. ఓ సమయంలో కొడుకు మృతదేహం వద్ద రెండు గంటలు కూర్చున్న అనంతరం మంత్రి నారాయణ.. ఇంటికి వెళ్లి తన కూతురు సింధును మెటల్‌గా ప్రిపేర్ చేశారు. ఎందుకంటే తన సోదరుడి మృతదేహాన్ని చూడలేనని ఆమె రోదించారు. దీంతో ఆమె వద్దకు వెళ్లారు.

కంటతడి పెట్టారు
బాధను దిగమింగి.. తనను కలిసిన వారితో మాట్లాడారు. కొడుకు చితికి తండ్రి నిప్పు అంటించడం, కుటుంబ సభ్యులు బాధను తలుచుకొని అక్కడకు వచ్చిన వారు కంటతడి పెట్టారు.

గంటపాటు సాగిన అంతిమయాత్ర
ఇదిలా ఉండగా, గురువారం నారాయణ ఆసుపత్రి ఆవరణ నుంచి ఆరంభమైన అంతిమయాత్ర సుమారు గంట సేపు కొనసాగింది. మంత్రి లోకేశ్, మంత్రి నారాయణ వియ్యంకుడు గంటా శ్రీనివాస రావు, డీజీపీ సాంబశివరావు తదితరులు కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు.

పక్క రాష్ట్రాల నుంచీ స్నేహితులు
నిషిత్ స్నేహితులు పలు రాష్ట్రాల నుంచి వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత్యక్రియల క్రతువు తర్వాత అప్పటివరకు గుండెదిటవుగా ఉన్న నారాయణ దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించారు.

నిషిత్ పేరిట ట్రస్ట్
నారాయణ ఆసుపత్రి ఆవరణలో నిషిత్‌కు గుర్తుగా స్థూపాన్ని నిర్మించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. నిషిత్‌కు గుర్తుగా ట్రస్టును ఏర్పాటు చేసి ప్రతి రోజూ వైద్య సేవల కోసం వచ్చే రోగులకు ఉచితంగా అన్నదానం చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కుటుంబసభ్యులు నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications