వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చుట్టూ నీరున్న చిత్రకొండ :మావోల అగ్రనేత స్థావరం

By Narsimha
|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్ :ఆంద్ర ఒడిశా సరిహాద్దు ....మావోయిస్టు పార్టీకి మంచి పట్టుండేది. ఒడిశాలో జరిగిన ఎన్ కౌంటర్ తో మావోయిస్టులుకోలుకోలేని ఎదురుదెబ్బతిన్నారు.ఏఓబిలోని కటాఫ్ ఏరియా మావోలకు రక్షణగానిలుస్తోంది. ఇక్కడ నిర్మించిన బలిమెల రిజర్వాయర్ వల్ల 151 గ్రామాలతో సంబందాలు తెగిపోయాయి.పడవలోనే ఈ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంది.ఇదే మావోలకు రక్షణకు కారణమైంది.

బలిమెల రిజర్వాయర్ ను 1964 లో నిర్మించారు.దీని కారణంగా 20 వేల మంది నివసం ఉండే 151 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబందాలు తెగిపోయాయి.67 చుట్టూ నీళ్ళ మద్యే ఈ గ్రామాలు విస్తరించాయి.ఈ గ్రామాలకు వెళ్ళాలంటే పడవలే ఆదారం.పడవులు లేకపోతే ప్రయాణం సాగదు.

maoist

ఈ గ్రామాలకు రహాదారి సౌకర్యం కల్పించేందుకు వీలుగా 1982 లో ఒడిశా సిఎం జెబి పట్నాయక్ గురుప్రియ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణాన్ని మావోలు అడ్డుకొంటున్నారు.పనులు ప్రారంభించినా ప్రాజెక్టు పూర్తి కాలేదు. నక్సల్స్ కారణంగానే కాంట్రాక్టర్ పనులను మద్యలో వదిలివేశాడు.చిత్రకొండకు వెళ్ళాలంటే పోలీసులకు ఇబ్బంది కలగుతోంది.

కటాప్ ప్రాంతంలో బెజింగి ప్రాంతం అత్యంత కీలకమైంది.భౌగోళికంగా దుర్భేద్యంగా ఉంటుంది. ఇక్కడే మావో అగ్రనేతలు స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటారు.మావోలను మినహా ఇతరులెవ్వరినీ గిరిజనులు అక్కడికి రాకుండా అడ్డుకొంటారు. ఇది కూడ మావోలకు కలిసివస్తోంది.

బెజెంగి ప్రాంతంలోకి వెళ్ళాలంటే బలిమెల బ్యాక్ వాటర్ నుండి గానీ, వాగుల గుండా గాని వెళ్ళాల్సిందే.ఈ రెండు మార్గాల్లో ప్రయాణిస్తే మావోయిస్టులకు సులభంగా దొరుకుతారు.మల్కన్ గిరి జిల్లా కలెక్టర్ గా ఉన్న వినీల్ కృష్ణ ఈ ప్రాంతంలో అబివృద్దికి కృషి చేశారు. అయితే 2008లో మావోలు ఆయనను కిడ్నాప్ చేశారు.మద్యవర్తుల చొరవతో మావోలు ఆయనను వదిలేశారు.ఇలాంటి చోట మావోలపై పోలీసులు పై చేయి సాధించడం విశేషమే.

English summary
chitamkonda ...maoist top leaders shelter place in odissa. this place near by balimela reservior, 151 villages not had to road for go out side the villages.because of balimela reservor.maoists are encash this situation everytime.but this time uper hand police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X