ఊసెండి దంపతులు: విభేదాలతోనే లొంగుబాటు
హైదరాబాద్: తమ ముందు లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత ఊసెండీని, ఆయన భార్య సంతోషిని రాష్ట్ర డిసిపి ప్రసాదరావు గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. పార్టీలో విభేదాలతోనే వారిద్దరు తమకు లొంగిపోయినట్లు ఆయన తెలిపారు. మావోయిస్టు దంపతులు ఊసెండీ, సంతోషి అజ్ఞాతంలో నిర్వహించిన కార్యకలాపాలపై డిజిపి ప్రసాద రావు మీడియా సమావేశంలో వెల్లడించారు.
మావోయిస్టు అగ్రనేత ఉసెండి పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఎస్ఐబీ ఎదుట మహిళా తన భార్య సంతోషి సహా జి. వెంకటకృష్ణ ప్రసాద్ అలియాస్ ఉసెండి లొంగిపోయారు. ఉసెండి లొంగుబాటుపై డిజిపి గురువారం ప్రకటన చేశారు. చత్తీస్‌గడ్‌కు చెందిన సంతోషి 15 ఏళ్లుగా అజ్జాతంలో కార్యకలపాలు నిర్వహించినట్లు డిజిపి చెప్పారు.

ఉసెండి దండకారణ్య స్పెషల్ జోన్ అధికార ప్రతినిధిగా, చత్తీస్‌గడ్ స్పెషల్‌జోన్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఉసెండి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరంగల్ జిల్ల్లా దేవరుప్పల్ మండలం కడివెండి గ్రామం. ఊసెండితో పాటు లొంగిపోయిన మహిళా మావోయిస్టును ఆయన భార్యగా భావిస్తున్నారు. ఊసెండిపై 20 లక్షల రూపాయల అవార్డు ఉంది. గత 25 ఏళ్లుగా ఊసెండీ నక్సలైట్ ఉద్యమంలో పనిచేస్తున్నారు.

ఊసెండీ ఛత్తీస్‌గడ్ అటవీ ప్రాంతంలో ఉంటూ నక్సలైట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన పేర ఇటీవలి కాలంలో ప్రకటనలు వెలువడుతూ వచ్చాయి.












Click it and Unblock the Notifications