శ్రీవారి దర్శన భాగ్యం కోసం ఎదురు చూసే భక్తులకు గుడ్ న్యూస్..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 62,112 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 22,541 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.36 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

కంపార్ట్‌మెంట్లు ఫుల్..

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

March 2025 quota of Arjita Seva tickets will be released on December 18

మార్చి కోటా టికెట్లు..

కాగా వచ్చే ఏడాది మార్చి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలకు సంబంధించిన కోటా టికెట్ల విడుదల వివరాలను టీటీడీ అధికారులు కొద్దిసేపటి కిందటే వెల్లడించారు.

డిప్ కోసం..

జనవరిలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌లు ఈ నెల 18వ తేదీన ఉదయం 10 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. రెండు రోజుల పాటు అంటే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవి తెరిచి ఉంటాయి. ఈ లోగా భక్తులు తమ పేరు, ఇతర వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

ఆర్జిత సేవలు..

శ్రీవారి కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ, తోమాల, అష్టదళ పాదపద్మారాధన వంటి సేవలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా బుకింగ్ ఈ నెల 21వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అలాగే- వర్చువల్ విధానంలో ఆయా సేవల్లో పాల్గొనదలిచిన వారి కోసం అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు బుకింగ్ అందుబాటులో ఉంటుంది.

అంగప్రదక్షిణం..

తిరుమలలో అంగప్రదక్షిణం చేయదలిచిన భక్తులకు ఉద్దేశించిన ఆన్‌లైన్ టోకెన్లు 23వ తేదీన ఉదయం 10 నుంచి అందుబాటులో ఉంటాయి. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం, వసతి గదుల కోటా అదే తేదీన ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతుంది.

ప్రత్యేక దర్శనం టికెట్లు..

మార్చిలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు టికెట్లను విడుదల చేస్తారు టీటీడీ అధికారులు. తిరుమల, తిరుపతిల్లో వసతి గదులను బుక్ చేసుకోవదలిచిన వారు అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

అఫీషియల్ వెబ్‌సైట్ ఇదే..

ఆయా టికెట్లను బుక్ చేసుకోవడానికి భక్తులు తమ అధికారిక వెబ్‌సైట్‌ https://ttdevasthanams.ap.gov.inను మాత్రమే సందర్శించాల్సి ఉంటుందని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

వసతి గదులు ఇవే..

తిరుపతి ప్రధాన బస్టాండ్ సమీపంలో శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణువాసం వసతి భవనాలు ఉన్నాయి. ఈ రెండు చోట్లా గదులను బుక్ చేసుకోవచ్చు. తిరుమలలో శ్రీ పద్మావతి అతిథిగృహం, శ్రీ వేంకటేశ్వర అతిథిగృహం, రామ్ బగీచా వరాహస్వామి విశ్రాంతి భవనం, ట్రావెలర్స్ బంగ్లా, నారాయణగిరి గెస్ట్ హౌస్, నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత, సప్తగిరి వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఆన్ లైన్ ద్వారా గదులను బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+