జగన్, గెలిచినా, ఓడినా జైలుకే: మారెప్ప, పద్మ ఆగ్రహం
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి రానున్న సారవ్తిర్క ఎన్నికల్లో గెలిచినా, ఓడినా తీహార్ జైలుకు వెళ్లక తప్పదని మాజీ మంత్రి మారెప్ప శనివారం సాయంత్రం మండిపడ్డారు. టైటానియం కుంభకోణం మొదలుకొని అనేక అక్రమాల ద్వారా జగన్ లక్షళ కోట్ల కొల్లగొట్టారని ఆరోపించారు.
సీమాంధ్రలో జగన్‌కు అధికారం ఇస్తే శ్మశానాలు కూడా వదిలి పెట్టరని ధ్వజమెత్తారు. జగన్ కుటుంబం క్రైస్తవం ముసుగులో దోపిడీదార్లుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యం దక్కక పోవడంతో తాను బయటకు వచ్చానని చెప్పారు.

వాసిరెడ్డి పద్మ ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఓ దినపత్రిక పని గట్టుకుని భుజానమోస్తున్నదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వేరుగా ధ్వజమెత్తారు. తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విషం కక్కుతోందన్నారు.
చంద్రబాబును అధికారంలోకి తేవడమే పరమావధిగా పనిచేస్తోందని ఆరోపించారు. వైయస్ బతికున్నప్పుడు ఆయనపై తప్పుడు వార్తలు ప్రచురించి, చనిపోయిన రోజు కీర్తిస్తూ వాస్తవాలను రాసిన ఆ పత్రిక.. జలయజ్ఞం పనులు నిలిచిపోతే ఎందుకు రాయలేదన్నారు.












Click it and Unblock the Notifications