ఈ ప్రోగ్రాం ఎవరూ మిస్ కాలేరంటున్న చార్మి (పిక్చర్స్)
మార్గదర్శి బిగ్ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డ్స్‌కు ప్రచారకర్తగా ప్రముఖ నటి చార్మీని 92.7 బిగ్ ఎఫ్ఎం హైదరాబాద్ ప్రకటించింది. చార్మి నగరంలోని తాజ్ వివంతాలో గురువారం అవార్డ్స్ ట్రోఫీని ఆవిష్కరించారు. కేవలం ప్రచారకర్తగా కాకుండా ఫైనల్ అవార్డ్స్ ఉత్సవంలో అభిమానుల కొరకు వేదికపై చార్మి ప్రదర్శన ఇస్తారు.
అవార్డుల ప్రచారకర్తగా మీడియాతో ఆమె మాట్లాడారు. వంద సంవత్సరాల భారతీయ సినిమా వేడుకలను జరుపుతున్న మార్గదర్శి బిగ్ తెలుగు ఎంటర్‌టైన్‌మంట్ అవార్డ్స్‌కు ప్రచారకర్తగా ఉండటం గౌరవప్రదంగా ఉందని, త్వరలో ప్రణాళికను రూపొందించి, పరిశ్రమలోని ఇతర స్నేహితులతో సాధనను ప్రారంభిస్తామన్నారు. నవంబర్ 8న జరిగే ఈ అవార్డుల మహోత్సవాన్ని ఎవరూ మిస్ కాలేరన్నారు.
అతిపెద్ద తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డుల కొరకు ఇటీవలె, మార్గదర్శి, బిగ్ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డ్స్ నామినేషన్లను మరియు ఓటింగ్ లైన్లను ప్రకటించింది. ఇప్పటికే 92.7 బిగ్ ఎఫ్ఎంలో ఆర్జేలు శ్రోతలను వివిధ విభాగాలలో నచ్చిన నామినీలకు ఓటింగ్ చేసేందుకు 55454కు ఎస్సెమ్మెస్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నామినేషన్ల ప్రచారం ఈటీవిలో ప్రసారమవుతోంది.

అవార్డ్స్ 1
తెలుగు సంగీత ప్రావీణ్యాన్ని మరియు నిజమైన ప్రజా ఎంపికల అవార్డును గుర్తించేందుకు మార్గదర్శి సమర్పిస్తున్న బిగ్ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డ్స్.

అవార్డ్స్ 2
వంద సంవత్సరాల తెలుగు సినిమాను గౌరవించేందుకు మరియు సత్కరించేందుకు, మధ్యయుగం మరియు ప్రస్తుత తరానికి చెందిన సినిమా, సంగీతం, క్రీడలు వంటి పలు రకాల ప్రముఖులను సమావేశపర్చేందుకు ఇది వేదికను ఏర్పాటు చేస్తుంది.

అవార్డ్స్ 3
మార్గదర్శి బిగ్ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డ్స్‌కు ప్రచారకర్తగా ప్రముఖ నటి చార్మీని 92.7 బిగ్ ఎఫ్ఎం హైదరాబాద్ ప్రకటించింది.

అవార్డ్స్ 4
మార్గదర్శి బిగ్ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డ్స్‌కు ప్రచారకర్తగా ప్రముఖ నటి చార్మీని 92.7 బిగ్ ఎఫ్ఎం హైదరాబాద్ ప్రకటించింది. చార్మి నగరంలోని తాజ్ వివంతాలో గురువారం అవార్డ్స్ ట్రోఫీని ఆవిష్కరించారు.

అవార్డ్స్ 5
వంద సంవత్సరాల భారతీయ సినిమా వేడుకలను జరుపుతున్న మార్గదర్శి బిగ్ తెలుగు ఎంటర్‌టైన్‌మంట్ అవార్డ్స్‌కు ప్రచారకర్తగా ఉండటం గౌరవప్రదంగా ఉందని, త్వరలో ప్రణాళికను రూపొందించి, పరిశ్రమలోని ఇతర స్నేహితులతో సాధనను ప్రారంభిస్తామని చార్మి తెలిపారు.












Click it and Unblock the Notifications