ఓడితే నా శవం చూస్తారు - చంద్రబాబు సాక్షిగా, టీడిపి అభ్యర్ధి సంచలనం..!!
ఏపీ ఎన్నికల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఓట్లు వేయమని ప్రచారం చేస్తున్న అభ్యర్దులు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు సమక్షంలోనే పార్టీ అభ్యర్ది కందుల నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అధినేత సమక్షంలోనే ఎన్నికల్లో పొరపాటు జరిగితే తన శవం చూస్తారంటూ వ్యాఖ్యానించారు.
ఏదైనా పొరబాటు జరిగితే నా శవం చూడల్సి వస్తుంది. టీడిపి అభ్యర్ధి కందుల నారాయణరెడ్డి సంచలన కామెంట్స్..!!#KandulaNarayanaReddy #TDP #Chandrababu #Oneindiatelugu pic.twitter.com/0VWD5HV8AG
— oneindiatelugu (@oneindiatelugu) April 1, 2024
పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ అభ్యర్ది సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి తన గెలుపు మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇవే తనకు చివరి ఎన్నికలని చెప్పుకొచ్చారు. ఈ సారి మార్కాపురం ప్రజలు నన్ను ఆశీర్వదించాలని కోరారు. ఏదైనా పొరబాటు జరిగితే మార్కాపురం ప్రజలు తన శవం చూడల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న చంద్రబాబు సైతం షాక్ అయ్యారు. కానీ, ఎక్కడా స్పందించలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటం ఖాయమని ప్రచారం చేస్తున్నారు.

ఈ సమయంలో చంద్రబాబు సమక్షంలోనే నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ హుజూరాబాద్ నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్ది పాడి కౌశిక్ రెడ్డి అప్పట్లో ఇదే తరహా వ్యాఖ్యలు చేసారు. ఆ తరువాత ఎన్నికల్లో విజయం సాధించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల పైన ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు నారాయణ రెడ్డి ఇదే తరహాలో వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారుతోంది. గెలుపు పైన నమ్మకం లేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. నారాయణ రెడ్డి వ్యాఖ్యల పైన ఎన్నికల సంఘం స్పందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో, ఇప్పుడు నారాయణ రెడ్డి వ్యాఖ్యల వ్యవహారం లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications