వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదు రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. ప్రియుడితో పెళ్లికుమార్తె జంప్!

మరో ఐదు రోజుల్లో పెళ్లి. పెళ్లి పత్రికలు కూడా పంచుకున్నారు. కానీ పెళ్లికూతురే ఊహించని పని చేసింది. ప్రియుడితో కలసి అదృశ్యమైంది. దీంతో కోపోద్రిక్తులైన యువతి బంధువులు ప్రియుడి ఇంటిపై దాడి చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

తిరుపతి: మరో ఐదు రోజుల్లో పెళ్లి. పెళ్లి పత్రికలు కూడా పంచుకున్నారు. కానీ పెళ్లికూతురే ఊహించని పని చేసింది. ప్రియుడితో కలసి అదృశ్యమైంది. దీంతో కోపోద్రిక్తులైన యువతి బంధువులు ప్రియుడి ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటన శుక్రవారం పెద్దతిప్పసముద్రం మండలంలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని పులికల్లు పంచాయతీ గొడ్డెంపల్లెకు చెందిన లచ్చన్నగారి వినోద్‌కుమార్‌ బి.కొత్తకోటలో చదువుకుంటున్న సమయంలో ఓ యువతి ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ.. ఒకరు డిగ్రీ మరొకరు ఎంబీఏ పూర్తి చేశారు. వీరి కులాలు వేర్వేరు కావడంతో పెద్దలు వీరి వివాహానికి నిరాకరించారు.

 Marriage Fixed, Bride Jumps with her lover

ఈ నేపథ్యంలో యువతికి మరో అబ్బాయితో ఈనెల 10వ తేదీన పెళ్లి నిశ్చయమైంది. బంధువులకు పెళ్లి పత్రికలు కూడా పంచుకున్నారు. అయితే గురువారం రాత్రి యువతి తన ప్రియుడితో కలిసి అదృశ్యమైంది.

దీంతో కోపోద్రిక్తులైన యువతి కుటుంబీకులు శుక్రవారం ఉదయం వినోద్‌కుమార్‌ ఇంటిపై దాడి చేశారు. ఇంటిలోని సామగ్రిని ధ్వంసం చేశారు. దీనిపై యువకుడి తల్లి సరస్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గ్రామానికి చెందిన శంకర, బత్తెప్పలతో పాటు మరో 12 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రుషికేశవ, ఎస్‌ఐ రవికుమార్‌లు తెలిపారు.

English summary
A bride ran away with her lover. This incident took place in Goddampally village of Pedda Tippa Sumadram mandal. After this incident Bride's family attackd on her lover's family. Issue went to police, they filed case against 12 members who participated in the attack and the case is under investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X