వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరదలిపై కన్నేసి.. పెళ్లికూతురు మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు పంపించాడు, ఆగిన పెళ్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: ఓ యువతి మార్ఫింగ్ ఫోటోలను ఓ వ్యక్తి వరుడి కుటుంబానికి పంపించడంతో ఆమె పెళ్లి ఆగిపోయిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం వన్నెచింతలపూడిలో ఓ పెళ్లి జరగాల్సి ఉంది.

<strong>హైదరాబాద్ ఫైవ్ స్టార్ హోటల్లో హైప్రొఫైల్ సెక్స్ రాకెట్, హీరోయిన్ అరెస్ట్</strong>హైదరాబాద్ ఫైవ్ స్టార్ హోటల్లో హైప్రొఫైల్ సెక్స్ రాకెట్, హీరోయిన్ అరెస్ట్

పెళ్లికి కొన్ని నిమిషాల ముందు ఓ వ్యక్తి పెళ్లి కూతురుకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు సందేశాలను స్పీడ్ పోస్టు ద్వారా పెళ్లి కుమారుడికి పంపించాడు. దీంతో ఆ పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కుమార్తె బంధువులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Marriage stoped after morphing photos sent grooms in East Godavati

కాగా, ఈ ఫోటోలు పంపించింది స్వయంగా బావ అని తెలుస్తోంది. సొంత బావ (అక్క భర్త) మరదలిపై కన్నేసి ఆమె వివాహం జరగకుండా చేశాడని తెలుస్తోంది. ఆమె తనకు సొంతం కావాలన్న స్వార్థంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. బావ సొంతూరు అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి.

బావ ఫోటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్. తన మరదలి మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు సృష్టించి వరుడికి పంపించాడు. వాటిని చూడటంతో పెళ్లి కుమారుడు, అతని బంధువులు పెళ్లి వద్దన్నారు. దీంతో పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయింది.

English summary
Marriage stoped after morphing photos sent grooms in East Godavati district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X