వివాహితపై నాటు వైద్యుడి అత్యాచారం: మహిళను కట్టేశారు
విజయవాడ: కృష్ణా జిల్లా నూజివీడు మండలం మోర్సపూడిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వివాహితను పసరువైద్యం చేస్తానంటూ నమ్మించిన గోవింద్ అనే నాటు వైద్యుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు నాటువైద్యుడికి దేహశుద్ధి చేశారు. నాటువైద్యుడి వెంట వచ్చిన మహిళను గ్రామస్థులు కట్టేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

హత్య కేసులో అరెస్టు
హత్యానేరంతో పాటు పలు దోపిడీ కేసుల్లో నిందితుడు మామిడి తిరుపతిరావును విశాఖపట్నం మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి పలు వాహనాలను, నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.
ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు
చిత్తూరు జిల్లా పూతలపట్టులో బడా ఎర్రచందనం స్మగ్లర్ కుమార్‌ను పూతలపట్టు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం తరలింపు వ్యవహారంలో ఈయనపై పలు కేసులున్నాయని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications