జగన్‌కు 'సొంత' ఇలాకాలో ఎమ్మెల్యే షాకిచ్చేనా? టిడిపి మైండ్ గేమా?

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లా కడపలోనే ఓ ఎమ్మెల్యే షాకివ్వనున్నారా? ఎవరైనా అధికార తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా? అంటే కావొచ్చుననే వార్తలు వస్తున్నాయి.

అయితే, అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది. జిల్లాకు చెందిన ఆయన ఆ జిల్లాలో కీలక ఎమ్మెల్యేగా ఉన్నారని చెబుతున్నారు.

కానీ, ఆయన పేరు ఇంకా తెలియరావడం లేదు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నేతలకు, ఆయనకు మధ్య చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. పూర్తిగా ఆయన సంసిద్ధత వ్యక్తం చేశాకే.. విషయం బయటకు రావొచ్చని అంటున్నారు.

May YSRCP MLA join in Telugudesam?

అయితే, తెలుగుదేశం పార్టీ స్థానిక నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసిపి అధ్యక్షుడు వైయస్ జగన్ మైండ్ గేమ్‌తో ఎమ్మెల్యేలను తన వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు చేసినట్లుగా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు స్థానిక నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారా? అనే వాదన కూడా ఉంది. అదే సమయంలో, పలువురు వైసిపి ప్రజాప్రతినిధులు ఎన్నికల అనంతరం టిడిపి వైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+