ఆఫీస్‌లోనే మేయర్ అనురాధ హత్య ఎందుకంటే!: డాన్.. చింటూ గురించి షాకింగ్ అంశాలు
చిత్తూరు: మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ఎన్నో ఆసక్తికర కోణాలు వెలుగులు చూస్తున్నాయి. మేయర్ దంపతుల హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూ గురించి షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయని జోరుగా వార్తలు వస్తున్నాయి.
చిత్తూరు డాన్‌గా ఎదగడమే చింటూ లక్ష్యమని, ఇందులో భాగంగానే కార్పోరేషన్ కార్యాలయంలో దాడికి పాల్పడ్డాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మేయర్ దంపతుల హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. వారి విచారణలో ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి.
చింటూ పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవాలు నెరపుతున్నాడు. ఇల్లు, కార్యాలయాల వద్ద నిరంతర నిఘా పెట్టుకున్నాడు. వీధిని అంతా కవర్ చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడని తేలిందని సమాచారం.

మేయర్ దంపతుల పైన దాడి చేసేందుకు మిగతా ప్రాంతాల్లో అవకాశమున్నా కార్పోరేషన్ కార్యాలయంలోనే దాడికి పాల్పడటం వెనుక.. చిత్తూరు డాన్‌గా ఎదగడంలో భాగంగానే ఇలా చేసినట్లుగా తెలుస్తోందని అంటున్నారు. విచారణలో చింటూ నేరాలు ఎన్నో వెలుగు చూసినట్లుగా సమాచారం.
నేర కార్యకలాపాలు అంటే ఆసక్తి
చింటూకు నేర సంబంధ వార్తలు అంటే ఆసక్తి అంటున్నారు. టీవీ చానళ్లలో కూడా క్రైం స్టోరీస్ ఎక్కువగా చూస్తుంటాడని, క్రైం సంబంధ సాహిత్యం చదువుతుంటాడని పోలీసులకు విచారణలో తెలిసిందని వార్తలు వస్తున్నాయి. చంపేస్తాననే పదాలు అతని నోటి నుంచి వచ్చేవని తేలిందని సమాచారం.
చింటూ కొంతకాలంగా భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని సమాచారం. రూ.15 కోట్లకు పైగా ఆస్తున్నాయని, అవన్నీ ఇతరుల పేరిట ఉన్నట్లుగా తెలుస్తోంది. పలు దాడుల్లో ప్రత్యక్షఖ పాత్ర ఉందని కూడా తెలుస్తోంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications