మేయర్ హత్య: విచారణలో షాకింగ్.. సినీ ఫక్కీలో తప్పించుకున్న చింటూ
చిత్తూరు: మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ సినీ ఫక్కీలో తప్పించుకున్నాడని విచారణలో తేలిందని తెలుస్తోంది. తాను ప్రయాణించిన కారును ఎవరూ గుర్తించకుండా చింటూ వేర్వేరు నెంబర్ ప్లేట్లను మార్చాడు.
హత్య కొంతదూరం వరకు అసలైన నెంబర్‌తో వాహనం నడిచింది. తర్వాత మరో రెండు నకిలీ నెంబర్ ప్లేట్లను మార్చి ప్రయాణం చేశాడు. మార్గమధ్యలో నలుపు రంగు కారును బెంగళూరులోనే వదిలేశారు. పోలీసులు సీజ్ చేసిన నలుపు రంగు కారులో ఓ తుపాకీ, బురఖా ఉంది.
చింటూకు లిఫ్ట్ ఇచ్చిన కమలాకర్ వాహనాన్ని కూడా సీజ్ చేశారు. హత్య అనంతరం తప్పించుకునేందుకు చింటూ అనుసరించిన రూట్ మ్యాప్ వివరాలు విచారణలో తెలిశాయి. హత్య అనంతరం చింటూ తన సన్నిహితుడు యోగ కారులో బయటపడ్డాడు.

గంగాధర నెల్లూరు మీదుగా తిరుత్తణికి చేరుకున్నాడు. రాత్రి ఓ లాడ్జిలో బసచేశాడు. అక్కణ్నుంచి ఊటీకి చేరుకున్నాడు. ఐడీ ప్రూఫ్, ఇతరత్రా ఇబ్బందులు వస్తాయని ముందుగానే పసిగట్టి, కమలాకర్ వాహనంలోనే బయలుదేరాడు. ఆ తర్వాత కమలాకర్ వెళ్లిపోయాడు.
అనంతరం ప్రయివేటు వాహనంలో మైసూరు - చెన్నై- వేలూరు - గుడియాత్తం - వికోట - పూర్ణమలై మార్గం మీదుగా చింటూ ముళ్‌బాగల్‌కు చేరుకున్నాడు. హత్య కుట్రలో పాల్గొన్న చింటూ డ్రైవర్ వెంకటేష్‌ను వేలూరు వద్ద పోలీసులు ప్రశ్నించారు. దీంతో ఇద్దరం కలిసి వెళ్తే అనుమానం వస్తుందని అతనిని అక్కడే దించేశాడు. ఆ తర్వాత ఒక్కడే ముళ్‌బాగల్ నుంచి పుంగనూరు చేరుకున్నాడు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications