మేయర్ హత్య: లొంగిపోయిన మొగలిని చితక్కొట్టారు, కాల్ మనీలో మరో షాకింగ్!

చిత్తూరు/విజయవాడ: చిత్తూరు జిల్లా నగర మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త హత్య కేసులో మరో నిందితుడు గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ విషయం తెలిసిన మేయర్ అనుచరులు పోలీసు స్టేషన్‌కు వచ్చి అతని పైన దాడి చేశారు. వారి దాడి తాళలేక అతడు ఏడ్చాడు.

మేయర్ దంపతుల హత్య కేసులో నిందితుడు మొగలి ఈ రోజు చిత్తూరు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ మొగలి లొంగిపోయిన విషయం తెలుసుకున్న మేయర్ అనుచరులు స్టేషన్‌కు వచ్చారు. అతని పైన తీవ్రస్థాయిలో దాడి చేశారు. పోలీసులు వారిని తప్పించి, అతనిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులకు లింక్: కాల్ మనీ కేసులో షాకింగ్

బెజవాడలో వెలుగు చూసిన కాల్ మనీ కేసులో ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి. తవ్వేకొద్ది నివ్వెరపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. కాల్ మనీ వెనుక సూత్రదారులు మాజీ ఏసీపీ సీఐ, పడమట పోలీసు స్టేషన్ ఏఎస్సై హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Mayor murder case: Another accused surrenders

ఏడాది క్రితం ఓ బాలుడిని కాల్ మనీ నిందితులు కిడ్నాప్ చేశారు. అప్పట్లో ఈ విషయంలో ఓ పోలీస్ అధికారి ఒత్తిడి తెచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాల్ మనీ గ్యాంగును రాజకీయ నాయకులకు, లిక్కర్ సిండికేట్లకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఎస్సై పరిచయం చేశాడని అంటున్నారు.

బాలుడి కిడ్నాప్ విషయమై కేసు నమోదు కాకుండా కూడా చూశాడని తెలుస్తోంది. మరోవైపు, బుధవారం కాల్ మనీ నిందితుడు శ్రీకాంత్ ఫాంహౌస్‌లో దొరికిన పందెం కోళ్లను ఒకరు బలవంతంగా విడిపించేందుకు ప్రయత్నం బెజవాడసూత్రధారుల వెనుక ఏసీబీ సీఐ, పడమట పిఎస్ ఏఎస్సై హస్తం,

విశాఖ కాల్ మనీ నిందితుడు రామకృష్ణ అరెస్ట్

కాల్ మనీ వ్యవహారంలో కొన్ని రోజుల నుంచి పరారీలో ఉన్న విశాఖ కాల్ మనీ నిందితుడు, టీడీపీ నేత గుడివాడ రామకృష్ణను పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నుంచి అదృశ్యమైన అతని కోసం కొన్నిరోజులు గాలింపు చేపట్టగా చెన్నైలో ఉన్నట్టు గుర్తించారు.

అతనిని బుధవారం అరెస్టు చేశారు. గురువారం విశాఖ తీసుకువచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టారు. తన వద్ద అప్పులు తీసుకున్న మహిళలను లైంగికంగా వేధిస్తున్న అతనిపై విశాఖ పట్టణ నాలుగో పోలీస్ స్టేషన్‌‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగానే రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+