చంపేస్తాం: చింటూ పేరిట సీఐకి బెదిరింపు లేఖ, పసుపు-గాజులు పంపారు
చిత్తూరు: మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో షాకింగ్! ఏకంగా పోలీసులకే బెదిరింపులు వచ్చాయి. చిత్తూరు రెండో పట్టణ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ సూర్యమోహన్ రావుకు బెదిరింపు లేఖ వచ్చింది. మేయర్ దంపతుల హత్య కేసులో కీలక నిందితుడు చింటూ పేరుతో ఈ లేఖ వచ్చింది.
చింటూ విడుదలైన వెంటనే నీ అంతు చూస్తామంటూ లేఖలో హెచ్చరించారు. ఆర్థిక లావాదేవీలన్నింటినీ బయటపెడతామని హెచ్చరించడమే కాకుండా, సీఐకి గాజులు, పసుపు పంపించారు. కేసు దర్యాప్తు సమయంలో సీఐకి బెదిరింపులు రావడం గమనార్హం. ఆ లేఖ ఎవరు రాశారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
నవంబర్ 17న మేయర్ దంపతుల హత్య జరిగింది. చింటూ పారిపోయాక అతని కోసం పోలీసులు గాలించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో సీఐ సర్యమోహన్ రావు తన బృందంతో కలిసి చింటూ నివాసంలో సోదాలు జరిపారు.

విచారణ సమయంలో అనుమానం వచ్చిన ప్రతి అంశాన్ని అడ్డు పెట్టుకొని సోదాలు చేశారు. ఆ సమయంలో ఎన్నో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు విలువ చేసే పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇలాంటి సమయంలో 'నా ఆస్తులకు సంబంధించిన పత్రాలు సీజ్ చేస్తావా' నీ అంతు చూస్తానని చింటూ పేరిట లేఖ రావడం కలకలం రేపుతోంది. జైలు నుంచి విడుదలయ్యాక నా లక్ష్యం నువ్వే అంటూ లేఖ రావడం గమనార్హం. దీంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు.
కాగా, చింటూ జైలులో ఉన్నప్పటికీ, అతని పేరిట ఈ లేఖ, లేఖతో పాటు గాజులు, పసుపు ఎవరు పంపారు? ఎందుకు పంపారు? అనే కోణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలో లేఖ వెనుక ఎవరు ఉన్నారో తేలుతుందని చెబుతున్నారు. చింటూ లొంగిపోవడానికి ముందు కూడా హత్యలతో తనకు సంబంధం లేదని లేఖ రాసిన విషయం తెలిసిందే.
-
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!












Click it and Unblock the Notifications