సమ్మెలోకి వైద్యారోగ్య శాఖ సంఘాల జేఏసీ - వెనక్కి తగ్గేదేలే : ప్రభుత్వానిదే బాధ్యత..!!

పీఆర్సీ సాధన కోసం ఉద్యోగ సంఘాలు సమ్మెకు డిసైడ్ అయ్యాయి. సమ్మె పిలుపుకు మద్దతిస్తున్న సంఘాలు పెరుగుతున్నాయి. ఉద్యోగుల నిరసనకు ఆర్టీసీ జేఏసీ మద్దతు తెలపగా.. వైస్సార్ అనుబంధ సంస్థ తాము సమ్మెలో పాల్గొనటం లేదని తేల్చి చెప్పింది. ఇక, తాజాగా ప్రస్తుత పరిస్థితుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వైద్యారోగ్య శాఖ సంఘాల జేఏసీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశమై తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టాలని నిర్ణయించాయి.

7వ తేదీ నుంచి సమ్మెలోకి

7వ తేదీ నుంచి సమ్మెలోకి

వైద్య ఆరోగ్య శాఖలోని ఉద్యోగులు రెండున్నారేళ్లుగా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పని చేస్తున్నా.. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోయారు. కరోనా సమయంలో సెలవులు కూడా ఇవ్వకుండా చేసారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ బాధ్యతలను జేసీలకి అప్పజెప్పొద్దని స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేద‌ని చెప్పుకొచ్చారు. పీఆర్సీ సాధన విషయంలో సమితి నేతలతో కలిసి వెళ్లాలని నిర్ణ‌యం తీసుకున్నట్లుగా నేతలు వెల్లడించారు. పీఆర్సీతో పాటుగా తమ శాఖ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోరుతూ తాము సైతం 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తామని జేఏసీ నేతలు స్పష్టం చేసారు.

ఆత్మ గౌరవం దెబ్బ తినేలా

ఆత్మ గౌరవం దెబ్బ తినేలా

వైద్య ఆరోగ్య శాఖ సాంకేతిక అంశాలు.. వైద్యం పైన అవగాహన లేని జేసీలు తాము వైద్యం ఎలా చేయాలో డిసైడ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమ ఆత్మ గౌరవం దెబ్బ తినేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఛలో విజయవాడను సక్సెస్ చేసి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని వెల్లడించారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మెడికల్ అధికారులంతా సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సంఘాల నేతలు ప్రకటించారు. ఉద్య‌మాన్ని నీరుగార్చేందుకే ఇప్పుడు వైద్యారోగ్య‌శాఖ‌లో బ‌దిలీలు తీసుకొచ్చార‌ని నేతలు ఆరోపించారు.

Recommended Video

    Bakkani Narasimhulu About Paritala Ravi Greatness..రవన్న ఆశయాలు ఎంతో గొప్పవి | Oneindia Telugu
    కరోనా వేళ ప్రభావం పడే ఛాన్స్

    కరోనా వేళ ప్రభావం పడే ఛాన్స్

    బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. వైద్యారోగ్య శాఖ సమ్మెకు వెళ్తే ప్రజల ప్రాణాలకు ఇబ్బందే అని.. ప్రజల ప్రాణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అంటూ స్పష్టం చేసారు. మ‌రోవైపు, ఎస్మాలకు భ‌య‌ప‌డేది లేద‌ని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. అయితే, కరోనా వేళ.. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సమ్మెలోకి వెళ్తే ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. దీంతో.. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+