నక్కతోక తొక్కిన మీనాక్షి చౌదరి!
తెలుగు సినీ పరిశ్రమలో ఒకే హీరోయిన్ తో హీరోలు రెండు సినిమాలు చేయడమనేది గగనంగా మారిపోయింది. దీనివల్ల వీరి కెరీర్ స్పాన్ తక్కువగా ఉంటోంది. మొన్నటివరకు బుట్టబొమ్మ పూజాహెగ్డే స్టార్ హీరోయిన్ గా రాణించింది. తాజాగా తన పరిస్థితి కూడా మారిపోయింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు వరుసగా ఫ్లాప్స్ అవడంతో అమ్మడి పరిస్థితి నెమ్మదిగా డౌనవుతూ వస్తోంది. కొన్ని అనివార్య కారణాలతో గుంటూరు కారం చిత్రం నుంచి బుట్ట బొమ్మ తప్పుకుంది. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.
తాజాగా వరుణ్ తేజ్ హీరోగా నటించే చిత్రంలో కూడా కథానాయికగా మీనాక్షి ఎంపికైంది. 'పలాస 1978' చిత్ర దర్శకుడు కరుణ కుమార్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో VT14 తెరకెక్కబోతోంది. ఈనెల 27వ తేదీన ఈ సినిమాను ప్రారంభించనున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించనున్న భారీ బడ్జెట్ చిత్రంలో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ కోసం మీనాక్షి చౌదరిని చిత్ర యూనిట్ సంప్రదించింది. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుంది.

గుంటూరు కారంతోపాటు వరుణ్ తేజ్ సినిమా, తాజాగా విడుదలైన విజయ్ ఆంటోనీ హత్య సినిమాలో మీనాక్షి నటించింది. ప్రస్తుతం గుంటూరు కారంతోపాటు వరుణ్ తేజ్ సినిమానే కాకుండా కథా చర్చలు జరుగుతున్న సినిమాలు రెండు ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు కారం, వరుణ్ తేజ్ సినిమాల్లో ఒక్కటి హిట్టయినా అమ్మడి పొజిషన్ టాప్ కు చేరుకుంటుంది. కాస్తంత ఆలస్యమైనా నక్కతోక తొక్కినట్లుందని, వరుసగా ఆఫర్లు పలకరిస్తున్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications