శ్రీవారి దివ్య రూపాన్ని గీసిన ధన్యజీవి.. చిత్రకారుడు శ్రీనివాసన్ అస్తమయం

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కోసం తిరుమలకు వెళ్తుంటాం.. ఎన్నో గంటల నిరీక్షణ తర్వాత ఆనంద నిలయంలో దేవదేవుడి దర్శనం.. కొన్ని సెకన్ల వ్యవధిలోనే ప్రపంచాన్ని మరిచిపోయి.. ఆయన ముందు తన్మయత్వంతో నిలబడిపోతాం. కానీ బయటకు వచ్చిన వెంటనే స్వామి స్వరూపం చాలా మందికి గుర్తుకు ఉండదు. అదే ఆ ఏడుకొండల స్వామి లీల. కోట్లాది మంది భక్తుల ఇలవేల్పుగా ఇలలో వెలిసిన వేంకటేశ్వరస్వామి దివ్య మంగళ స్వరూపం వర్ణనాతీతం.

మనందరి ఇళ్లలో, ఫోన్లలో.. ఆపద మొక్కులవాడి శాంత గంభీర వదనం, అభయ హస్తం, శంఖుచక్రధారీ అయిన ఆ నీలమేఘ శ్యాముని రూపం భక్తుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఇళ్లలో, పూజా మందిరాలలో కొలువై పూజలందుకుంటున్న స్వామివారి చిత్రపటానికి ప్రాణం పోసిన ఆ అద్భుత కుంచె నేడు ఆగిపోయింది.

Meet the Man Behind the Sacred Portrait of Lord Venkateswara in Your Home Artist SM Srinivasan Dies

తిరుమల శ్రీవారి దివ్య రూపాన్ని తన చిత్రకళతో అమరత్వం కల్పించిన ప్రఖ్యాత చిత్రకారుడు ఎస్.ఎం. శ్రీనివాసన్ (86) తమిళనాడులోని కోవిల్‌పట్టిలో ఉన్న తన స్వగృహంలో గురువారం వయోభారంతో కన్నుమూశారు.

ధన్యుడైన చిత్రకారుడు.. అపురూప అవకాశం:

తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్, ప్రముఖ చిత్రకారుడు కొండయ్య రాజు గారి వద్ద చిత్రకళలో ఓనమాలు నేర్చుకున్నారు. ఆయనలోని ప్రతిభను గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), 1970వ సంవత్సరంలో ఆయనకు ఒక అరుదైన, అత్యంత పవిత్రమైన అవకాశాన్ని కల్పించింది. సాక్షాత్తు ఆనంద నిలయం గర్భగుడిలోకి వెళ్లి, మూలవిరాట్టును నేరుగా వీక్షించి చిత్రించే భాగ్యం ఆయనకు దక్కింది.

TTD గోల్డెన్ ఛాన్స్:రూ.5 చెల్లిస్తే 'సద్గమయ'లో నమోదు, ఫ్యామిలీతో శ్రీవారి దర్శనం..!!
TTD గోల్డెన్ ఛాన్స్:రూ.5 చెల్లిస్తే 'సద్గమయ'లో నమోదు, ఫ్యామిలీతో శ్రీవారి దర్శనం..!!

కుంచెతో చేసిన స్వామి సేవ:

దీపాల వెలుగులో మెరిసిపోతున్న స్వామివారిని దర్శించుకున్న శ్రీనివాసన్, ఆ తన్మయత్వంలో తన కుంచెకు పనిచెప్పారు. భక్తుల కోరిక మేరకు స్వామివారి రెండు రూపాలను ఆయన ఆవిష్కరించారు.

  • సర్వాభరణాలంకృత రూపం: కిరీటం, హారాలు, వజ్ర వైడూర్యాలతో కూడిన ఆభరణాలతో శోభిల్లుతున్న స్వామివారి తేజోమయ రూపం.
  • నిరాడంబర రూపం: నగలు లేకుండా, కేవలం స్వామివారి సహజ సిద్ధమైన దివ్య స్వరూపాన్ని, ఆ ముఖ వర్చస్సును ఆవిష్కరించే నిరాడంబర రూపం.

ఈ రెండు చిత్రాలను టీటీడీ ఆమోదించి, ఫొటోలు, క్యాలెండర్లుగా ముద్రించింది. అప్పటి నుంచి ఈ చిత్రాలే ఇంటింటా వేంకటేశ్వరుడికి ప్రతీకలుగా మారాయి. నేడు మనం ఇళ్లలో చూసి నమస్కరిస్తున్న స్వామివారి ఫొటో వెనుక ఉన్నది శ్రీనివాసన్ గారి కఠోర సాధన, భక్తి భావం.

శ్రీవారి భక్తులకు మరో సూపర్ ఫెసిలిటీ.. తిరుమలలో స్మార్ట్‌ బస్టాప్‌ల నిర్మాణం!
శ్రీవారి భక్తులకు మరో సూపర్ ఫెసిలిటీ.. తిరుమలలో స్మార్ట్‌ బస్టాప్‌ల నిర్మాణం!

వేంకటేశ్వరస్వామితో పాటు పలు ఇతర హిందూ దేవతామూర్తుల చిత్రాలను కూడా ఆయన అద్భుతంగా గీశారు. శ్రీవారి రూపానికి తన చిత్రకళతో శాశ్వతత్వాన్ని అందించి, భక్తుల గుండెల్లో నిలిచిపోయిన శ్రీనివాసన్ గారి మృతి చిత్రకళా రంగానికి, ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటు. ఆయన ఆత్మకు ఆ శ్రీవారి పాదాల చెంత శాంతి కలగాలని కోరుకుందాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+