నాగబాబు రాజ్యసభ ఆఫర్ తిరస్కరణ - అసలు కారణం..!?
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ ఢిల్లీ పర్యటన..తరువాతి పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర మంత్రులతో వరుసగా పవన్ సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి వస్తూనే పవన్ కాకినాడ పోర్టు వద్ద దూకుడుగా వ్యవహరించటం సంచలనంగా మారింది. ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు ను రాజ్యసభకు ఎంపిక చేయటం పైన కొత్త చర్చ తెర పైకి వచ్చింది. నాగబాబు పెద్దల సభకు వెళ్లటం పైన కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది.
కొత్త సమీకరణాలు
పవన్ ఢిల్లీ పర్యటన ద్వారా ఏపీ భవిష్యత్ రాజకీయం పైన కీలక సంకేతాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన పవన్ ఆ వెంటనే కాకినాడలో బియ్యం మాఫియా ఫైన ఫోకస్ చేసారు. కాకినాడ పోర్టు లో పవన్ అధికారులను నిలదీసారు. పోర్టు భద్రత పైన ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని డిసైడ్ అయ్యారు. బియ్యం మాఫియా కొనసాగటం పైన ఆగ్రహంతో అధికారుల పై చర్యలకు సిఫార్సు చేసారు. ఇక, రాజకీయంగానూ పవన్ నిర్ణయాలు కూటమిలో చర్చకు కారణం అవుతున్నాయి. ఇదే సమయంలో పవన్ ఢిల్లీ పర్యటనలో తన అన్న నాగబాబుకు రాజ్యసభ సీటు కోసం చర్చించారనే వార్తలతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

పవన్ ఢిల్లీ టూర్ తో
ఏపీ నుంచి మూడు రాజ్యసభ స్థానాల కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి రాజీనామా చేసిన ముగ్గురి స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన బీదా మస్తాన రావుకు తిరిగి రాజ్యసభ సీటు పైన హామీ దక్కింది. ఇక, రెండు స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి పోటీ ఉంది. ఆర్ క్రిష్ణయ్య రాజీనామాతో ఆయనకు బీసీ కమిషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని బీజేపీ ఆలోచన చేస్తోంది. దీంతో, ఆయన స్థానం భర్తీ తమ పార్టీ అభ్యర్ధితో భర్తీ చేయాలని ప్రతిపాదించింది. దీంతో, జనసేన కు సీటు పైన డైలమా మొదలైంది. ఈ సమయంలోనే నాగబాబుకు సీటు కోసం ఢిల్లీ పర్యటనలో బీజేపీలో నేతలతో పవన్ చర్చలు చేసారంటూ వార్తలు వచ్చాయి.
నాగబాబు క్లారిటీ
ఈ వార్తల పైన నాగబాబు మనస్థాపానికి గురయ్యారు. పవన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి వెళ్తే తనకు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు రావటంతో తన అభిప్రాయం వెల్ల డిస్తూ ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిసింది రాష్ట్ర అభివృద్ధి కోసమే అని.. తన స్వార్థం కోసం కాదని చెప్పుకొచ్చారు. పవన్ కోసం పనిచేయటమే తన అంతిమ లక్ష్యం అని తేల్చి చెప్పారు. అలాంటి నాయకుడికోసం నా లైఫ్ ని ఇవ్వటానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని..తన రాజకీయ ఆశయం లేదని తేల్చి చెప్పారు. కొందరు పార్టీ ముఖ్యలతోనూ ఇదే అంశం పైన చర్చ చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో తాను రాజ్యసభకు వెళ్తే పవన్ పైన జరుగుతున్న ప్రచారం నిజమని భావించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు నాగబాబును రాజ్యసభకు ఎంపిక చేసే అంశంలో పవన్ తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications