కుక్క మొరిగందునుకో : మీమ్స్ - వీడియోలతో తో నాగబాబు సెటైర్లు : కౌంటర్లు ఇలా - మధ్యలో పూనం ట్వీట్..!!

ఏపీలో నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏపీ మంత్రులు, అదే విధంగా పవన్ వర్సస్ పోసాని అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పవన్ చేసిన స్పీచ్ తో మంట మొదలైంది. ఆ వేదిక నుంచి పవన్ ఏపీ ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేసారు. మంత్రి పేర్ని నాని గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక, దీనికి స్పందనగా ఏపీ మంత్రులుగా వరుసగా స్పందించారు. ఇక, ఇదే వివాదంలో ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా సినీ నటుడు పోసాని తెర మీదకు తొలి రోజు పవన్ పైన విమర్శలు చేసారు. జగన్ పాలనను ప్రశంసించారు.

అదుపు తప్పిన పోసాని వ్యాఖ్యలు

అదుపు తప్పిన పోసాని వ్యాఖ్యలు

అదే పోసాని రెండో రోజు నిర్వహించిన మీడియా సమావేశం ఉద్రిక్తతకు కారణమైంది. ఒక సమయంలో అదుపు తప్పిన పోసాని..పవన్ పైన వ్యక్తిగత దూషణలకు దిగారు. అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారదు. ఇదంతా జరిగిన కాసేపటికే నాగబాబు 'ఆస్క్‌ మీ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమాను ల ముందుకు వచ్చారు. అనేక ప్రశ్నలకు మీమ్స్ తోనే సెటైరికల్ గా సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ గురించి స్పందించాలని కోరగా ఆయన ఒక పవన్ పైన పోసాని మాట్లాడిన ఒక వీడియో పోస్టు చేసారు

మెగా బ్రదర్ నాగబాబు రియాక్షన్ ఇలా

మెగా బ్రదర్ నాగబాబు రియాక్షన్ ఇలా

అందులో... పవన్‌కల్యాణ్‌ ఈ రోజు మళ్లీ సినిమా హీరోగా యాక్ట్‌ చేస్తానంటే.. నేను అతనికి బ్లాం క్‌ చెక్‌ ఇస్తా. ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చు. కోటా, రెండు కోట్లా, పది కోట్లా, ఇరవై కోట్లా, 30 కోట్లా! 40 కోట్లు కూడా ఇస్తా. నాకు డేట్స్‌ ఇస్తే. అంత డిమాండ్‌ ఉన్న హీరో. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఇండియాలోని టాప్‌ హీరోల్లో అతనొకరు...అని అందులో పోసాని చెబుతారు.అదే విధంగా మొత్తం ఎపిసోడ్ లో కాంట్రవర్సీగా మారిన ఏపీలో ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారం పైన ప్రశ్నకు సమాధానంగా.. 'విక్రమార్కుడు' చిత్రంలో రవితేజ, బ్రహ్మానందం మో సాలు చేసి డబ్బులు పంచుకునే సన్నివేశాన్ని పోస్ట్‌ చేశారు.

మీమ్స్ - వీడియోలతో సమాధానాలు

మీమ్స్ - వీడియోలతో సమాధానాలు

'చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడైనా సరిగా పంచావ్‌రా!' అంటూ బ్రహ్మానందం వాపోయే సీన్‌ చూపించారు. 'మోసం చేసినవాడు బాగుపడడురా!' అని బ్రహ్మానందం శపించగా... 'ఆ మనం చేసేది గుళ్లో పూజ మరి' అనేది ఆ సన్నివేశంలోని సంబాషణ. ఇక, పోసాని గురించి ఒక్క మాట అనే దానికి సమాధానంగా..'సమరసింహారెడ్డి'లో బాలకృష్ణ ఫొటో పోస్ట్‌ చేశారు. ఆ సన్నివేశంలో డైలాగ్‌... 'కుక్కపిల్ల మొరిగిందనుకో అనేది ఆ ఫొటో సారాంశంగా గుర్తు చేసుకుంటున్నారు.

సన్నాసి కామెంట్స్ పైన మోహన్ బాబు వీడియోతో

సన్నాసి కామెంట్స్ పైన మోహన్ బాబు వీడియోతో

ఇక, సన్నాసి నాని గురించి చెప్పు అనే దానికి సమాధానంగా..'నేనేం చెప్పాలి. దేశంలో ఈ అవార్డులనేవి వస్తే ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులూ రావాలి. ఆస్కార్‌కు కూడా వెళ్లే అవకాశం ఉంది. అయ్యప్పస్వామి సాక్షిగా అటువంటి పర్ఫార్మెన్స్‌ చూడలేదు' అని 'గుండెల్లో గోదావరి' ఆడియో వేడుకలో మోహన్‌బాబు వీడియో పోస్ట్‌ చేశారు. మరో ప్రశ్నగా మీరు ఏ బ్రాండ్‌ తాగుతారు అనే దానికి సమాధానంగా.. 'ప్రెసిడెంట్‌ మెడల్‌, ఆంధ్రా గోల్డ్‌, గెలాక్సీ, బూమ్‌ బూమ్‌' ఫొటోలు పోస్ట్‌ చేశారు.

పవన్ ప్రశ్నలపై స్పందన ఇలా

ఇక, రిపబ్లిక్ మావీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో పవన్ చేసిన స్పందన పైన ప్రశ్నలు వచ్చాయి. దానికి నాగబాబు స్పందనగా కోరాగా.. 'ఒక శివమణి జాబ్‌ కొట్టినట్టు... ఒక జాకీర్‌ హుస్సేన్‌ తబలా కొట్టినట్టు... శంకర్‌ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ వాయించినట్టు... కొట్టుడు పాడించుడు... కొట్టుడు పాడించుడు' అంటూ 'కింగ్‌' చిత్రంలో బ్రహ్మానందాన్ని శ్రీహరి కొట్టిన తీరును శ్రీనివాసరెడ్డి వివరించే సన్నివేశం వీడియో పోస్ట్‌ చేశారు. ఇక, ఇలా పవన్ వర్సెస్ వైసీపీ అనే విధంగా వివాదం సాగుతున్న సమయంలో నటి పైనం కౌర్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.

Recommended Video

    Interview with Praja Sangala leader Sagar On 27 Bandh | Oneindia Telugu
    ట్వీట్లతో తెర పైకి పూనం కౌర్

    ట్వీట్లతో తెర పైకి పూనం కౌర్

    గురువులా నన్ను ఆదుకున్న దాసరి నారాయణ రావు అంటై ఒక ట్వీట్ పోస్టు చేసారు. మరో ట్వీట్ రౌడీ దర్బార్ లో చంద్రలోకం వీడియో సాంగ్ ను పూనం పోస్టు చేసారు. ఇక, పవన్ అభిమానుల నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ పోసాని వెల్లడించారు. ఇప్పుడు ఈ వివాదం పవన్ ఫ్యాన్స్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారింది. సోషల్ మీడియాలో రెండు వైపుల నుంచి అనుకూల - వ్యతిరేక పోస్టింగ్ లు హల్ చల్ చేస్తున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+