బాలకృష్ణ Vs చిరంజీవి, రంగంలోకి ముఖ్య నేతలు- కీలక మలుపు..!?
మెగా బ్రదర్స్ ఎందుకు మౌనంగా ఉన్నారు. బాలకృష్ణ Vs చిరంజీవి ఎపిసోడ్ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు... చిరంజీవి స్పందనతో ఇప్పుడు ఈ వ్యవహారం సినీ - పొలిటికల్ వివాదంగా మారుతోంది. వైసీపీ నేతలు ఈ ఎపిసోడ్ ను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వివాదంలో ఇప్పటి వరకు మెగా బ్రదర్స్ డిప్యూటీ సీఎం పవన్... ఎమ్మెల్సీ నాగబాబు స్పందించ లేదు. దీని పైన కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారానికి ముగింపు పలికేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
వ్యాఖ్యల కలకలం
అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి స్పందన సైతం అదే స్థాయిలో ఉంది. దీంతో.. సభలో కామినేని - బాలకృష్ణ మధ్య సంవాదం జరగాల్సింది కాదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సభలో చిరంజీవి పైన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పైన పవన్ - నాగబాబు స్పందించ లేదు. దీని పైన ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతోంది. అటు అన్నయ్య చిరంజీవి.. ఇటు కూటమి నేత బాలకృష్ణ కావటంతో పవన్ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. పవన్ ఆలోచన ఏంటో స్పష్టత లేక.. జనసేన నేతలు సైతం డైలమాలో ఉన్నారు. అటు చిరంజీవి అభిమానులు సమావేశాలు ఏర్పాటు చేసి.. బాలకృష్ణ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు అగ్ర హీరోలు కావటం.. కూటమి పార్టీలు గా అధికారంలో ఉండటంతో... ఈ వ్యవహారానికి ముగింపు పలికే అంశం పైన తాజాగా ముఖ్య నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

మెగా బ్రదర్స్ మౌనం
ఈ వివాదంలో పవన్- నాగబాబు మౌనం దాల్చారు. ఈ సమయంలోనే జగన్ నాడు చిరంజీవిని అవమానించారనే ప్రచారంలో నిజం లేదంటూ చిరంజీవి తేల్చి చెప్పటం రాజకీయంగానూ చర్చ గా మారింది. అసెంబ్లీలో బాలకృష్ణ సైతం జగన్ ను చిరంజీవి నిలదీయలేదని చెప్పటంతో పాటుగా.. చిరంజీవి సైతం తనను జగన్ సాదరంగా ఆహ్వానించారని పేర్కొన్నారు. ఇదే సమయం లో జగన్ ను ఉద్దేశించి అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి నాడు జగన్ వద్దకు వెళ్లే సమయంలో బాలకృష్ణ కోసం ప్రయత్నాలు చేసిన విషయాన్ని వివరించారు. అదే విధంగా జగన్ ను కలిసేందుకు బాలకృష్ణ అప్పాయింట్ మెంట్ కోరారని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. దీంతో.. ఈ వ్యవహారంలో బాలకృష్ణ క్యాంప్ ఒక విధంగా రాజకీయంగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది.

కీలక మలుపు
అటు చిరంజీవి ఫ్యాన్స్ సైతం రంగంలోకి దిగారు. బాలకృష్ణ వ్యాఖ్యల పై నిరసనలకు సిద్దం అవుతున్నారు. రేపు (ఆదివారం) చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో సమావేశం కావాలని నిర్ణయించారు. దీంతో, మెగా- నందమూరి కి దగ్గరగా ఉండే ఇద్దరు ముఖ్యులు రంగంలోకి దిగారు. చిరంజీవి పైన చేసిన వ్యాఖ్యలను సమర్థించలేక... కూటమి మిత్రపక్షంగా ఓపెన్ గా వ్యతిరేకించలేక పవన్ క్యాంప్ తర్జన భర్జన పడుతోంది. ఏ విధంగా ముందుకు వెళ్లినా.. మరో వైపు నుంచి సమస్య తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో.. రెండు వైపులా ప్రస్తుతానికి మౌనంగా ఉండే విధంగా కొత్త ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. మరింతగా ఈ వివాదం పెరగకుండా మంత్రాంగం సాగిస్తున్నట్లు సమాచారం. దీంతో, ఈ వివాదం సమిసిపోతుందా.. కొత్త టర్న్ తీసుకుంటుందా అనేది ఈ రోజు.. రేపు జరిగే పరిణామాలతో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications