అధికార మదం తలకెక్కింది..బాలకృష్ణపై విరుచుకుపడ్డ మెగా బృందం
అసెంబ్లీ వేదికగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ నందమూరి బాలకృష్ణ గారు చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని సృష్టించాయి. ప్రజాక్షేత్రంలో, చట్టసభల సాక్షిగా చేసిన ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బాలకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మెగా కుటుంబంపై బాలకృష్ణ గతంలోనూ అనేకసార్లు అవమానకరంగా మాట్లాడినప్పటికీ, వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవి గారు ఎప్పుడూ స్పందించలేదు. అభిమానులు సైతం ఆయన మనసెరిగి సంయమనం పాటించారు. అయితే, ఇప్పుడు చట్టసభల్లో సైతం చిరంజీవి గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడటంపై అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. ఈ వ్యాఖ్యలు తమ దైవమైన చిరంజీవి సైతం బాధించాయని, ఆయన ప్రతిస్పందన ద్వారా అది స్పష్టమవుతోందని అభిమానులు పేర్కొన్నారు.

బాలకృష్ణ తమ కుటుంబం తీవ్ర వేధింపులకు గురై, జైలు పాలైనప్పుడు అండగా నిలిచింది, అలాగే ఆయన కుటుంబం అధికారంలోకి రావడానికి అహర్నిశలూ కృషి చేసింది మెగా కుటుంబమే అన్న విజ్ఞతను బాలకృష్ణ మరిచారని అభిమానులు ఆరోపిస్తున్నారు. అధికార మదం తలకెక్కించుకున్న బాలకృష్ణ గారు ఈ చరిత్రను విస్మరించడం దారుణమని వారు మండిపడ్డారు.
మెగా కుటుంబం అండగా నిలవకపోతే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే మంచిదని అభిమానులు బాలకృష్ణకు హితవు పలికారు. బాలకృష్ణ వైఖరిని, వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న మెగా అభిమానులు... మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని హెచ్చరిస్తున్నారు.
తక్షణం బాలకృష్ణ స్పందించి, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేని యెడల, ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని మెగా అభిమాన సంఘాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. మరి మెగా అభిమానులు ఇచ్చిన హెచ్చరికపై బాలకృష్ణ ఆయన అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications