వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్, జనసేన జెండాలతో ఫ్యాన్స్: ఏమంటారని చిరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి రోడ్డు షోలో ఓ మెగా అభిమాని కాంగ్రెసు పార్టీ జెండాతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జెండాను కూడా పట్టుకున్నారు. చిరు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.

కాంగ్రెసు నేత అయిన చిరు ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తుండగా.. పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతు పలికిన విషయం తెలిసిందే. అయితే, మెగా అభిమానులు చాలామంది పవన్ వైపుకు వెళ్లారు. గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గంలో చిరు రోడ్డుషోలో ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది.

Mega fans with Congress and Jana Sena flags

చిరు రోడ్డు షోలో మెగా అభిమానులు కొందరు ఓ చేత్తో కాంగ్రెసు జెండాతో పాటు జనసేన జెండాను పట్టుకున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా తామంతా మెగాస్ట్ర కుటుంబ సభ్యులమేనని చెప్పారు. మరో విషయమేమంటే కొందరు ప్రజారాజ్యం పార్టీ జెండాలు కూడా పట్టుకున్నారు.

ఏం చెబుతారు: చిరు

కాంగ్రెసు పార్టీ మృత జీవి అన్న బిజెపి నేత వెంకయ్య నాయుడు వ్యాఖ్యల పైన చిరంజీవి సోమవారం మండిపడ్డారు. ఆయన పర్యటన గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడారు. మే 2న గుంటూరులో సోనియా సభ ఉండనుందని చెప్పారు. తప్పు చేసిన వారు చట్టం నుండి తప్పించుకోలేరని జగన్‌ను ఉద్దేశించి చెప్పారు. అవినీతికి పాల్పడే వారిని కాంగ్రెసు ఎప్పుడు ఉపేక్షించదన్నారు. సుజనా చౌదరి పైన వచ్చిన అభఇయోగాల పైన ప్రశ్నిస్తే చంద్రబాబు ఏం సమాధానం చెబుతారన్నారు.

English summary
Mega fans with Congress and Jana Sena flags in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X