పవన్ కు మెగా హీరో షాక్..!? అయన మద్దతు ప్రకటించిదెవరికో తెలుసా..!
మరో నాలుగు రోజుల్లో ఏపిలో పోలింగ్. జనసేన ఎన్నికల్లో ఏలాంటి ప్రభావం చూపిస్తుందనే ఉత్కంఠ. పవన్ కళ్యాన్ అభి మానులు..పాలిటికల్ సర్కిల్స్ వేచి చూస్తున్న సమయం. సరిగ్గా ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కు షాక్ ఇచ్చే లా మెగా హీరో ఓ నిర్ణయం ప్రకటించారు. దీంతో...ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు..జనసేన కార్యకర్తలు సైతం ఇదే అంశం పై చర్చ మొదలు పెట్టారు.
మొన్న పవన్..నాగబాబుకు మద్దతుగా...
మెగా ఫ్యామిలీ నుండి కొద్ది రోజుల క్రితం చిరంజీవి తనయుడు రాం చరణ్ బాబాయ్ పవన్ కళ్యాన్ ను తన మద్దతు ఎప్పు డూ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే, పవన్-నాగబాబు కు మద్దతుగా ఇప్పటి వరకు మెగా హీరోలు ఎవరూ ఎన్నికల ప్రచారానికి మాత్రం రాలేదు. దీంతో..జనసేన అధినేతగా ఉన్న పవన్ ఇప్పటి వరకూ పూర్తిగా పార్టీ గెలుపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇక, రెండు రోజుల క్రితం మెగా హీరో బన్ని ఓపెన్ గా పవన్ కు తన మద్దతు ప్రకటించా రు.

ఎన్నికల్లో బరిలో ఉన్న పవన్ - నాగబాబుకే తన మద్దతు అంటూ ప్రకిటించారు. ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఇక, ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కుటంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు విదేశీ టూర్ కు వెళ్లారు. మిగిలిన వారు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చే పరిస్థితి లేదు. సరిగ్గా ఇదే సమయంలో మెగా హీరో పవన్ కు షాక్ ఇచ్చేలా ఓ ప్రకటన విడుదల చేసారు.
వైసిపి అభ్యర్దికి మెగా హీరో మద్దతు..
ఇలా...జనసేన హీరోలకు మద్దతు ప్రకటించిన రెండు రోజులకే మెగా హీరో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. నంద్యాల నుండి పోటీ చేస్తున్న శిల్పా రవి చంద్రా రెడ్డికి మెగా హీరో అల్లు అర్జున్ మద్దతు ప్రకటించారు. ఆయన ఎన్నికల్లో గెలవాలని ఆకాం క్షించారు. రవి తనకు మంచి మిత్రుడు అని రాజకీయంగా విభిన్న పరిస్థితుల్లో తాము ఉన్నా..రవి భవిష్యత్ బాగుండా లని తాను కోరుకుంటున్నట్లు వివరించారు.

శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు అయిన శిల్పా రవి చంద్రారెడ్డి వైసిపి నుం డి నంద్యాల ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. జనసేన నుండి ఎస్పీవై రెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక, అక్కడ జనసేన అభ్యర్ది పోటీలో ఉన్నా..అల్లు అర్జున్ ఓపెన్ గా వైసిపి అభ్యర్దిగా ఉన్న రవికి పరోక్షంగా మద్దతు ప్రకటిం చటం ద్వారా ఇప్పుడు జనసేన లో టెన్షన్ మొదలైంది. ఇక, ఇప్పుడు జనసేన అభిమానులు ఏ రకంగా స్పందిస్తారు.. పవన్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications