గూగుల్ డేటా సెంటర్ ఎఫెక్ట్..! విశాఖకు మెగా రియల్టర్ల క్యూ..!
విశాఖలో 15 బిలియన్ డాలర్ల ఖర్చుతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామన్న ప్రకటన తర్వాత పరిస్ధితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకూ సాగరతీరాన ఉన్న నగరంగా మాత్రమే విశాఖను చూసిన పలు కంపెనీలు ఇప్పుడు అభివృద్ధి అవకాశాలకు చిరునామాగా నగరాన్ని చూస్తున్నారు. అంతే కాదు ఏపీలో అమరావతి సంగతి తర్వాత ముందు విశాఖకు వెళ్తే తమకు ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో విశాఖ తీరం ఇప్పుడు హాట్ కేక్ గా మారుతోంది.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రకటన తర్వాత దేశంలోని మెగా రియల్టర్ల చూపు ఒక్కసారిగా నగరంపై పడింది.
అదే సమయంలో ఐటీ కంపెనీలు కూడా భారీగా తరలివస్తున్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటోంది. భారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులు ఇక్కడ చేపట్టేందుకు సిద్ధమవుతున్నవారు. ప్రభుత్వం కూడా వీరిని ప్రోత్సహించడం ద్వారా వాణిజ్య రాజధానిని అభివృద్ధి చేయాలని భావిస్తోంది.

ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలోనే టాప్‌లో ఉన్న రహేజా, సత్వా, ఏఎన్‌ఎస్‌ఆర్ గ్రూపులు విశాఖకు తరలివస్తున్నాయి.
వైజాగ్ చుట్టుపక్కల భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఈ మూడు కంపెనీలు ముందుకొచ్చాయి. దీంతో ఈ మూడు సంస్థల ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మధురవాడలో రూ.2,172 కోట్లతో రహేజా ప్రాజెక్ట్ తమ వ్యాపార విస్తరణకు సిద్దమవుతోంది. వైజాగ్‌ను కీలకంగా భావిస్తున్న రహేజా.. ఈ మేరకు ప్రాజెక్టు విస్తరిస్తోంది.
ఏపీ ప్రభుత్వ ప్రోత్సాహం, సీఎం చంద్రబాబు పిలుపుతో ముందుకు వచ్చామని రహేజా సీఓఓ శ్రవణ్ కుమార్ తెలిపారు. విశాఖలో ఇప్పటికే రహేజా గ్రూప్ పెద్ద మాల్ నిర్మిస్తోంది.జనవరిలో ఈ మాల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.1,500 కోట్లతో విశాఖలో సత్వా గ్రూప్ ఇంటిగ్రేటెడ్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతోంది. గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు ఏఎన్‌ఎస్‌ఆర్ ముందుకు వచ్చింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications