బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన మెగాస్టార్
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గెలుపు కోసం రాజకీయ పార్టీలన్నీ కూడా గట్టిగానే శ్రమిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర చేస్తుండగా,టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ సైతం వారాహి విజయభేరి సభలంటూ నిరంతరం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక అధికారంలో ఉన్న వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి.
వైసీపీ అధికారంలో ఉండటం వల్ల రాష్ట్ర అభివృద్ది కుంటుపడిందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీలకు చెందిన నేతలు అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. టికెట్ దక్కిన అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని మాజీ రాజ్యసభ్యుడు సీఎం రమేష్ దక్కించుకున్నారు.

ఆయన బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. ప్రచారంలో భాగంగా సోమవారం మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. చిరంజీవిని కలిసిన సీఎం రమేష్ ఆయన మద్దతు కోరారు. ఈ సందర్భంగా సీఎం రమేష్‌కు అభినందనలు తెలిపిన చిరంజీవి ఎన్నికల్లో గెలుస్తారని.. తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని.. ప్రజల కోసం ఎల్లప్పుడు పాటుపడేవారికి మద్దతిస్తామని చిరంజీవి అన్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి ఇటీవలే తన తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీకి మద్దతుగా నిలిచారు. జనసేనకు రూ.5 కోట్ల రూపాయిల భారీ విరాళం ఇచ్చారాయన.ఇప్పుడు తమ్ముడు పార్టీతో కలిసి పోటీ చేస్తున్న అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారాయన.
-
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!












Click it and Unblock the Notifications