పసుపురంగు ట్యాక్సీ- టీ గ్లాస్: మెగాస్టార్ వింటేజ్ లుక్
అమరావతి: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం- భోళా శంకర్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న మూవీ ఇది. మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కీర్తి సురేష్ కీలక పాత్రను పోషిస్తోంది. చిరంజీవి చెల్లెలి క్యారెక్టర్‌లో నటిస్తోంది కీర్తి సురేష్. అజిత్ నటించిన సూపర్ హిట్ తమిళం మూవీ వేదాళంకు రీమేక్ ఇది. ఈ ఏడాది ఆగస్టులో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో చిరంజీవి నటించిన సినిమాలేవీ పెద్దగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకోలేదు.. ఒక్క వాల్తేరు వీరయ్య తప్ప. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మారింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లూసిఫర్ రీమేక్ గాడ్‌ఫాదర్'పైనా అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ రెండింటి తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాల్తేరు వీరయ్య మాత్రం చిరంజీవి అభిమానులతో విజిల్స్ వేయించింది.

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 133 కోట్ల రూపాయల క్లోజింగ్ కలెక్షన్లను రాబట్టుకుంది. ఇందులో వింటేజ్ లుక్స్‌తో అదరగొట్టారు మెగాస్టార్. మాస్ లుక్స్‌తో కనిపించడంతో ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. రవితేజ కూడా ఈ సినిమాలో నటించడం ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేశారు మెగాస్టార్.
ఇక తన తాజా చిత్రం భోళాశంకర్‌తో బిజీగా ఉంటోన్నారు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఇందులో ట్యాక్సీ డ్రైవర్ క్యారెక్టర్‌ను పోషిస్తోన్నారు చిరంజీవి. ట్యాక్సీ డ్రైవర్ రూపంలో తమ బాస్‌కు మరోసారి మాస్ క్యారెక్టర్ పడిదంటూ అభిమానులు సందడి చేస్తోన్నారు. వారి ఆనందాన్ని రెట్టింపు చేసేలా భోళా శంకర్ చిత్రం యూనిట్ తాజా లుక్స్‌ను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది.
కార్మికులు,కర్షకులు, శ్రమ జీవులకు అందరికి మే డే శుభాకాంక్షలు❤️
— AK Entertainments (@AKentsOfficial) May 1, 2023
Team #BholaaShankar honour & celebrate every worker on this #MayDay💥
Releasing in Theatres on AUG 11th🤟🏻
Mega🌟 @KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @adityamusic pic.twitter.com/nOtkv3AntS
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ లుక్స్‌ను రిలీజ్ చేసింది. కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియజేస్తోన్నట్లు పేర్కొంది యూనిట్. పసుపురంగుతో ఉన్న ట్యాక్సీతో అద్దిరిపోయే స్టైలిష్ లుక్స్‌తో కనిపించారు మెగాస్టార్. లేత నీలం, గ్రే కలర్ ట్యాక్సీ డ్రైవర్ యూనిఫాంతో మెరిసిపోయారు. కారు వద్ద నిల్చుని టీని సిప్ చేస్తూ వింటేజ్ లుక్స్‌తో మెగాస్టార్ అద్దిరిపోయారు.












Click it and Unblock the Notifications