రాజ్యసభకు మెగాస్టార్?

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజకీయ రంగప్రవేశం చేయబోతోన్నారా? పెద్దల సభకు నామినేట్ కానున్నారా? ఇదివరకట్లా మళ్లీ హస్తినలో మళ్లీ చక్రం తిప్పబోతోన్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఫలానా పార్టీ అనే ముద్ర పడకుండా తటస్థంగా ఉంటూనే మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారబోతోన్నారనే ప్రచారం సాగుతోంది.

సామాజిక సేవ లేదా చలనచిత్ర రంగం కేటగిరీ నుంచి

చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయనుందని తెలుస్తోంది. సామాజిక సేవ లేదా చలనచిత్ర రంగం కేటగిరీ నుంచి ఆయనను రాష్ట్రపతి కోటా కింద ఎగువసభకు పంపించాలని భావిస్తోన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ఓ కీలక నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు.

Megastar Chiranjeevi likely to nominate to Rajya Sabha

పవన్ ప్రతిపాదనలు?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది.. చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ నెలకొల్పిన జనసేన పార్టీ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంలో జనసేన అత్యంత కీలక పాత్రను పోషించింది మొన్నటి ఎన్నికల్లో.

బీజేపీ వద్ద పలుకుబడి

భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకొని వెళ్లేలా చేయడంలో పవన్ కల్యాణ్‌దే కీ రోల్. ఫలితంగా ఢిల్లీలో బీజేపీ పెద్దల వద్ద ఆయన పట్టు, పలుకుబడి పెరిగిందనడంలో సందేహాలు అక్కర్లేదు. తన రెండో సోదరుడు నాగబాబుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గంలో బెర్త్ కన్‌ఫర్మ్ చేయగలగడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

రాజ్యసభకు

ఈ క్రమంలో చిరంజీవిని కూడా రాజ్యసభకు నామినేట్ చేయాలంటూ పవన్ చేసిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందనే ప్రచారం ఉంది. ఫలానా పార్టీ అనే ముద్ర లేకుండా రాష్ట్రపతి కోటా కింద ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయాలని భావిస్తోన్నట్లు చెబుతున్నారు.

రాష్ట్రపతి కోటా కింద..

వివిధ రంగాల్లో సేవలను అందించిన ప్రముఖులకు రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్, మాజీ అథ్లెట్ పీటీ ఉష, సంగీత దర్శకుడు ఇళయరాజా, సినిమా కథా రచయిత విజయేంద్ర ప్రసాద్, సామాజిక కార్యకర్త సుధామూర్తి.. ఇలా నామినేట్ అయిన వారే.

కేంద్ర మంత్రిగా..

ఇదే కేటగిరీలో చిరంజీవిని కూడా నామినేట్ చేయవచ్చని అంటున్నారు. రాజ్యసభలో అడుగు పెట్టడం మెగాస్టార్‌కు కొత్తేమీ కాదు. గతంలో కాంగ్రెస్ నుంచి పెద్దల సభలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. యూపీఏ 2.O ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించారు అప్పట్లో. రాజ్యసభ పదవీకాలం ముగిసిన తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటోన్నారు. సినిమాలకు పరిమితం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+