వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Chiranjeevi:సీఎం జగన్ ఇన్ స్పైరింగ్ లీడర్: ఇద్దరి మధ్యా మెగా రిలేషన్ : పవన్ కళ్యాణ్ చూస్తున్నారా..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

ఏపీలో రోజు రోజుకీ మారుతున్న సమీకరణాలు సరి కొత్త బంధాలకు తెర లేపుతున్నాయి. జాతీయ-ప్రాంతీయ పార్టీల మధ్య పొత్తు ఉన్నా...సంబంధాలు మాత్రం అధికార పార్టీ నేతల మధ్య చాలా బలంగా కనిపిస్తు న్నాయి. ఇక, ఇప్పుడు ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తుల మధ్య సంబంధం బలపడుతోంది. కేంద్ర మాజీ మంత్రి..మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో సీఎం జగన్ నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ అండగా నిలుస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలను ప్రోత్సహించేలా అభినందిస్తున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కర అంశంగా మారుతోంది.

జగన్ స్పూర్తి దాయక నాయకత్వమంటూ..

సీఎం జగన్ ప్రభుత్వం ఏపీలో ఒకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేసింది. ఇది ఒక రికార్డు. దీని పైన బీజేపీ నేతలు మాత్రం వ్యాక్సిన్లు మావి...ప్రచారం మీకు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వ వ్యాక్సినేషన్ నిర్వహణను అభినందించారు. ప్రభుత్వ చర్యలు కరోనా వేళ ప్రజలలో విశ్వాసాన్ని నింపుతోందని పేర్కొన్నారు. స్పూర్తి దాయక నాయకత్వం అందిస్తున్న సీఎం జగన్ కు కంగ్రాట్స్ అంటూ చిరంజీవి ట్వీట్ చేసారు. ఏపీలో ముఖ్యమంత్రి గా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత చిరంజీవి ఆయనతో క్లోజ్ రిలేషన్ కొనసాగిస్తున్నారు. సీఎం సైతం చిరంజీవికి అదే స్థాయిలో గౌరవం ఇస్తూ మెగా బంధం ఏర్పరుచుకుంటున్నారు. ఇది భవిష్యత్ రాజకీయాలకు నాందిగా ప్రచారం సాగుతోంది.

 సీఎం నిర్ణయాలకు మద్దతుగా..

సీఎం నిర్ణయాలకు మద్దతుగా..

ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని అన్ని పార్టీలు వ్యతిరేకించినా...తొలుత సమర్దించింది చిరంజీవి. అదే విధంగా విశాఖ స్టీల్ ప్యాక్టరీ అంశంలోనూ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా చిరంజీవి స్పందించారు. ఇక, రెండు సార్లు అమరావతికి వెళ్లి సీఎం ను చిరంజీవి కలిసిన సందర్భాలంలోనూ ఇద్దరి మధ్య ఆప్యాయతలు కనిపించాయి. చిరంజీవి సినిమా సమస్యలు ప్రస్తావించగా...అన్నా..ఆ సమస్యలు పరిష్కరించటానికి నేను సిద్దంగా ఉన్నాను..మీరు సినీ ఇండస్ట్రీకి ఏ సమస్యలు ఉన్నా లీడ్ తీసుకొని ముందుకు రండి అంటూ జగన్ ఆహ్వానించారు. సినీ పెద్దలతో కలిసి చిరంజీవి ముఖ్యమంత్రి ముందుంచిన ప్రతిపాదనలకు వీలుగా ఏపీ ప్రభుత్వం జీవో సైతం జారీ చేసింది. దీనికి వెంటనే చిరంజీవి స్పందించి ధన్యవాదాలు తెలిపారు.

 జగన్..చిరంజీవి మధ్యలో పవన్

జగన్..చిరంజీవి మధ్యలో పవన్

ఇక, విశాఖ లో సినీ పరిశ్రమ విస్తరణ పైన చిరంజీవి సైతం ఆసక్తిగా ఉన్నారు. ఇదే సమయంలో...జగన్ తో చిరంజీవి దగ్గరవటం పైన వైసీపీ ఫ్యాన్స్ ఈ మెగా రిలేషన్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పోస్టులు పెడ్డుతున్నారు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చూస్తున్నారా...ఎవరైనా సరే జగన్ అన్న పాలనను శభాష్ అనాల్సిందే..చిరంజీవి జగన్ అన్నను పొడుగుదూ ట్విట్టర్ లో పెట్టినారు...ఆ కిక్కే వేరప్పా...అంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే, రాజకీయంగా పవన్ గురించి చిరంజీవి ఏనాడు అనుకూల - వ్యతిరేకత కామెంట్లు చేయలేదు. పవన్ సైతం చిరంజీవి నిర్ణయాల పైన మాట్లాడలేదు.

 భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై అంచనాలు

భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై అంచనాలు

పూర్తిగా సినిమాల్లో బిజీ అయిపోయి..రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి...ఇప్పుడు టాలీవుడ్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి..ఇండస్ట్రీ కి మధ్య వారధిగా వ్యవహరిస్తున్నారు. ఇక, సీఎం జగన్ నిర్ణయాలను ప్రశంసిస్తూ...జగన్ తో మెగా రిలేషన్ కంటిన్యూ చేయటం మాత్రం ఖచ్చితంగా అటు సినీ ఇండస్ట్రీ ...ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ముఖ్యమంత్రిని విమర్శించినా..చిరంజీవి మాత్రం ఏనాడు ముఖ్యమంత్రి పైన విమర్శలు చేయలేదు. ఇది ఇలా ..ఇద్దరి మధ్య సినీ పెద్దన్నయ్య..సీఎం రిలేషన్ గానే కంటిన్యూ అవుతుందా..లేక, మెగా పొలిటికల్ రిలేషన్ గా మారుతుందా అనేది వేచి చూడాలి.

English summary
Chiranjeevi lauds AP govt over record vaccination program and congratulates CM Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X