ఈ నెల 9వ తేదీ ఫిక్స్ : ఏపీ సీఎం జగన్‌ను కలవనున్న మెగాస్టార్ చిరంజీవి టీమ్..ఎందుకంటే..?

అమరావతి: కరోనావైరస్ కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో సినిమా షూటింగులకు బ్రేక్ పడగా అప్పటికే షూటింగులు పూర్తి చేసుకుని ల్యాబ్‌కు చేరిన ఆయా సినిమాల ప్యాచ్‌ వర్క్స్‌ కూడా నిలిచిపోయాయి. ఇక లాక్‌డౌన్ కొనసాగిస్తూనే ఆంక్షలు సడలించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమాలపై ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చించాలని భావించారు సినిమా పరిశ్రమ పెద్దలు. ఈ క్రమంలోనే చిరంజీవి నేతృత్వంలో పలువురు ఇండస్ట్రీ పెద్దలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. సినిమా షూటింగుల కొనసాగింపుపై ఒక క్లారిటీకి వచ్చారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టీమ్ త్వరలో ఏపీ సీఎం జగన్‌ను కలవనుంది.

కరోనావైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీ భారీగా నష్టపోయింది. షూటింగులు నిలిచిపోయి, సినిమాలు థియేటర్లకు చేరని పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు బంద్ అవడంతో విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలు ల్యాబ్‌లకే పరిమితమయ్యాయి. ఈ క్రమంలోనే తిరిగి సినిమా షూటింగులు ప్రారంభించేందుకు గత నెలలో చిరంజీవి నివాసంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసానితో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలు భేటీ అయి చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తాజాగా చిరంజీవి నేతృత్వంలోని బృందం ఈ నెల 9వ తేదీన ఏపీ సీఎం జగన్‌ను కలవనున్నారు.

Megastar Chiranjeevi to meet AP CM Jagan on 9th June,to discuss on film shootings

ఈ సందర్భంగా వారంతా షూటింగ్‌కు అనుమతులు ఇవ్వాలంటే జగన్‌కు విజ్ఞప్తి చేయనున్నారు. అదే సమయంలో పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల విషయం కూడా సీఎం దృష్టికి తీసుకురానున్నట్లు సమాచారం. సినిమా హాళ్ల ఓపెనింగ్, సినీ కార్మికులు, పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై చర్చించనుట్లు సమాచారం. దీనిపై గతంలో ఒకసారి గుర్తుచేయగా చిరంజీవినే ఆ బాధ్యత తీసుకోవాలని జగన్ సూచించారు. ఇక ఈ వారంలో జరగబోయే తాజా భేటీపై ఇటు సినీ అభిమానులు అటు మెగా అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+