Bholaa Shankar trailer: షికార్‌కు వచ్చిన షేర్..!!

అమరావతి: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం- భోళా శంకర్. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న మూవీ ఇది. మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కీర్తి సురేష్ కీలక పాత్రను పోషిస్తోంది. చిరంజీవి చెల్లెలి క్యారెక్టర్‌లో నటిస్తోంది కీర్తి సురేష్. ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన విడుదల కానుంది.

అజిత్ నటించిన సూపర్ హిట్ తమిళం మూవీ వేదాళంకు రీమేక్‌ ఇది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కింద రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ మధ్యకాలంలో చిరంజీవి నటించిన సినిమాలేవీ పెద్దగా ఫ్యాన్స్‌ను ఆకట్టుకోలేదు.. ఒక్క వాల్తేరు వీరయ్య తప్ప. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మారింది.

bholashankartrailer

మలయాళంలో సూపర్ హిట్ అయిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లూసిఫర్ రీమేక్ గాడ్‌ఫాదర్‌'పైనా అభిమానులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ రెండింటి తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాల్తేరు వీరయ్య మాత్రం చిరంజీవి అభిమానులతో విజిల్స్ వేయించింది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 133 కోట్ల రూపాయల క్లోజింగ్ కలెక్షన్లను రాబట్టుకుంది.

ఇందులో వింటేజ్ లుక్స్‌తో అదరగొట్టారు మెగాస్టార్. మాస్ లుక్స్‌తో కనిపించడంతో ఆయన అభిమానులు పండగ చేసుకున్నారు. రవితేజ కూడా ఈ సినిమాలో నటించడం ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేశారు మెగాస్టార్. ఇక ఆయన నటించిన తాజా చిత్రం భోళాశంకర్‌‌పై మంచి హైప్ ఏర్పడింది. ఇప్పటికే టీజర్ విడుదలయింది.

ఇందులో ట్యాక్సీ డ్రైవర్ క్యారెక్టర్‌ను పోషిస్తోన్నారు మెగాస్టార్. ట్యాక్సీ డ్రైవర్ రూపంలో తమ బాస్‌కు మరోసారి మాస్ క్యారెక్టర్ పడిదంటూ అభిమానులు సందడి చేస్తోన్నారు. వారి ఆనందాన్ని రెట్టింపు చేసేలా ఉంది భోళా శంకర్ టీజర్. కొద్దిసేపటి కిందటే రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 థియేటర్లల్లో విడదలయింది టీజర్. తెలంగాణ యాసలో చిరంజీవి అదరగొట్టారు.

bholashankar

ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోయే ఈ మూవీ కోసం మెగా కాంపౌండ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్నారు. ఫ్యాన్స్‌ను మరింత ఉత్సాహపరిచేలా కొద్దిసేపటి కిందటే భోళా శంకర్ ట్రైలర్ విడుదలయింది. 1:13 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్.. మెగాస్టార్ మెరుపులకు అద్దం పట్టింది.

విడుదలైన తొలి అరగంటలోనే రెండున్నర లక్షలకు పైగా లైక్స్ పడ్డాయంటే.. చిరు సత్తా ఏమిటో, ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తోన్నారనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇందులో మెగాస్టార్ తెలంగాణ యాసలో మరింత డెప్త్‌గా డైలాగ్స్ చెప్పారు. డాన్స్, ఫైట్స్‌లో వింటేజ్ లుక్స్‌లో మెస్మరైజ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+