జోగి రమేశ్ కొడుకులో ఆ లోపం..! డబ్బులిస్తే ఫీలింగ్స్ వస్తాయని- కోడలు మేఘన షాకింగ్ ..!
వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబానికీ, కోడలు మేఘనకూ (Meghana) మధ్య జరుగుతున్న వార్ తాజాగా బయటపడుతోంది. జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ నపుంసకుడని తెలిసి కూడా దాచిపెట్టి, క్రైస్తవులని చెప్పకుండా తనతో పెళ్లి జరిపించి మోసం చేశారంటూ ఆయన కోడలు మేఘన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జోగి రమేశ్ తో పాటు మొత్తం 10 మంది కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ వ్యవహారంపై జోగి రమేశ్ వివరణ ఇవ్వగా.. దానికి కౌంటర్ గా ఆయన కోడలు మేఘన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరిన్ని షాకింగ్ అంశాలు బయటపెట్టారు.
ఇలాంటి రోజు వస్తుంది, ఆడపిల్లగా ఇలా మాట్లాడాల్సి రావడం చాలా బాధగా ఉందని జోగి రమేశ్ (Jogi Ramesh) కోడలు మేఘన తెలిపారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొని గట్టిగా నిలబడ్డానన్నారు. ఈరోజు ఈపరిస్థితులను దైర్యంగా ఎదుర్కొన్నందుకు గర్వంగా ఫీలవుతున్నట్లు తెలిపారు. జోగి రమేష్ , వారి కుటుంబ సభ్యులు తనపై నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. గతేడాది మే నెలలో జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తో తనకు పెళ్లి చేశారని, తన తండ్రి సంతోషం కోసం ఎంతో కష్టపడి ఈ పెళ్లి జరిపారన్నారు. జోగి రమేష్ మీద నమ్మకంతో వారింటికి కోడలుగా పంపారన్నారు. కానీ కొన్ని రోజులకే నన్ను ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారని మేఘన ఆరోపించారు.

ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోవడం అనేది సహజమని, కానీ రాజీవ్ కు ఉన్న ప్రాబ్లమ్ ఆ కుటుంబ సభ్యులు అందరికీ తెలుసని మేఘన ఆరోపించారు. అయినా అతనితో తనకు పెళ్లి చేసి, అమ్మాయి గొంతు కోయడం అనేది పెద్ద నేరమన్నారు. జోగి రమేష్ కు కూడా ఒక కూతురు ఉందని, ఆమెకు ఇలా జరిగితే ఏం చేస్తారని మేఘన ప్రశ్నించారు. అసలు లోపం ఉందని తెలిసి నాతో ఎలా పెళ్లి చేశారో జోగి రమేష్ చెప్పాలన్నారు. తమ ఇద్దరి మధ్య గొడవలు రావడం వల్లే విడిపోయారని నిన్న జోగి రమేష్ చెబుతున్నారని, అసలు ఈ గొడవ ఎందుకు వచ్చిందో ఆయన చెప్పాలన్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకే జోగి రమేష్ నిన్న మీడియాతో మాట్లాడారన్నారు. జోగి రమేష్ నిన్న సింపథీ కోసం, రాజకీయం కోసం మాట్లాడినట్లు ఉందన్నారు. అసలు వాస్తవాలు ఏమిటో నేను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించానని తెలిపారు.
ఇప్పుడే బయటపడకున్నా.. తప్పకుండా త్వరలోనే అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయన్నారు. తమ వివాహం జరిగిన తర్వాత ఉన్న ఇబ్బందులను మాయయ్య, అత్తయ్యకే వివరించానని మేఘన తెలిపారు. సమస్యలను పరిష్కరించకుండా.. అదనపు కట్నం తేవాలంటూ మా అత్తయ్య నన్ను హింసించిందన్నారు. తమకు పొలిటకల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి తాము చెప్పిందే చేయాలని బెదిరించారని ఆరోపించారు. అదనపుకట్నం తీసుకువస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు.. అప్పడే అతనికి ఫీలింగ్స్ వస్తాయని అత్త మాట్లాడిందన్నారు. తల్లి స్థానంలో ఉన్న శకుంతల అర్దం చేసుకోకుండా తననే తప్పు బట్టారన్నారు. పెళ్లికి ముందు హిందువులం అని చెప్పి పెళ్లి చేశారని, కానీ వారి కుటుంబం మొత్తం క్రిస్టియన్స్ అని, ఇంట్లో హిందూ పూజలు అస్సలు చేయరని తెలిపారు. తనకు చిన్న నాటి నుంచి హిందూ పూజలు చేయడం అలవాటని వివరించారు. అత్తవారింటికి వెళ్లిన తర్వాత కూడా ఒక్క హిందూ దేవుళ్ల ఫొటో కూడా లేదన్నారు. తాను దేవుళ్ల పొటో తెచ్చి పూజ చేస్తుంటే అడ్డుకుని కొట్టారన్నారు. ఎవరి నమ్మకం వాళ్లది, కానీ తమకు క్రిస్టియన్ మతం తీసుకున్నట్లు కూడా చెప్పలేదని తెలిపారు. ఇది మోసమే అన్నారు.

అసలు వాస్తవాలు వదిలేసి ఇంకా ఇప్పటికీ జోగి రమేష్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మేఘన ఆరోపించారు. రాజకీయం చేస్తున్నాం.. ఎవరినో కలిస్తే.. నడిపిస్తున్నారని చెబుతున్నారన్నారు. కానీ తన వద్ద ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే బయట పెడతానని హెచ్చరించారు. అత్తగా ఉన్న శకుంతల అనేక రకాలుగా తనను ఇబ్బందులు పెట్టిందని,
కొడుకు లోపం గురించి మాత్రం మాట్లాడకుండా నిందలు తనపై మోపుతున్నారన్నారు. మీ దేవుడిని నమ్ముకోవడం వల్లే నీకు ఇలా జరిగింది.. మా దేవుడిని నమ్ముకో నీకు మంచి జరుగుతుందని చెప్పేవారని ఆవేదన వ్యక్తం చేశారు. జోగి చెప్పినట్లు కూతురిలా చూసుకుంటే తాను ఇలా రోడ్ల మీదకు రావాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్నారు. జోగి రమేష్ కుటుంబం వల్ల ఇఫ్పటికే చాలా ఇబ్బందులు పడ్డానని, ఇప్పటికీ తప్పు అంగీకరించకుండా, తనపై కక్ష సాధించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను కలిసి వచ్చిన వీడియోను దొంగచాటుగా తీశారని, న్యాయం కోసం ఆయన వద్దకు వెళ్లానని తెలిపారు. జోగి రమేష్ సొంత బాబాయితో కూడా ఎమ్మెల్యే మాట్లాడి కుటుంబ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారన్నారు.












Click it and Unblock the Notifications