బిగ్ హింట్ ఇచ్చిన మెహర్ రమేష్..!!

అమరావతి: ఐసీసీ వరల్డ్ కప్.. ఇంకో మూడు నెలల్లో ఈ బిగ్గెస్ట్ క్రికెట్ ఈవెంట్ ఆరంభం కాబోతోంది. దీనికోసం క్రికెట్ ఆడే అన్ని దేశాలు సన్నద్ధమౌతోన్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌‌తో తీరిక లేని షెడ్యూల్స్‌ను ఎదుర్కొంటోన్నాయి. ఇది 13వ ఎడిషన్ వరల్డ్ కప్. ఇప్పటివరకు 12 మెగా టోర్నమెంట్లు ముగిశాయి. అత్యధికంగా ఆస్ట్రేలియా అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.

ఈ టోర్నీలో భాగంగా అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. బలమైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 11వ తేదీన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొడుతుంది. ఆ తరువాత జరిగే గేమ్‌లో అంటే.. తన మూడో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్‌కు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక.

Bhola Shankar

మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్. చిరంజీవి, తమన్నా జోడీగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. 101 కోట్ల రూపాయలతో సినిమా తెరకెక్కగా.. 30 కోట్ల బిజినెస్ కూడా నమోదు చేయట్లేదు. బిజినెస్ క్లోజ్ అయ్యే నాటికి కనీసం 50 కోట్ల రూపాయల మేర నష్టం రావొచ్చనే అంచనాలు ఉన్నాయి.

మెహర్ రమేష్ బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాలకు, ఐసీసీ ట్రోఫీలకు ఓ లింక్ ఉంది. మెహర్ రమేష్ డిజాస్టర్ సినిమాలు విడుదలైన రెండుసార్లు కూడా టీమిండియా ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. ఆయా సంవత్సరాల్లో నిర్వహించిన ట్రోఫీల్లో కప్‌లను ఎగరేసుకెళ్లింది. ఇప్పుడు కూడా అలాంటి సందర్భమే ఏర్పడింది.

Meher Ramesh

2011లో మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన శక్తి సినిమా విడుదలైన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ హీరో. ఈ సినిమా ఆయన కేరీర్‌లో అతిపెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. అదే సంవత్సరం ఐసీసీ వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచింది భారత్. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను మట్టి కరిపించి.. విజేతగా ఆవిర్భవించింది.

ఇది కాకతాళీయంగా జరిగిందనుకున్నా.. 2013లోనూ అలాంటి సంఘటనే సంభవించింది. వెంకటేష్ నటించిన షాడో సినిమా విడుదలైన సంవత్సరం అది. దీనికీ మెహర్ రమేషే దర్శకుడు. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. వెంకటేష్ కేరీర్‌లోనే అతిపెద్ద ఫ్లాప్ మూవీ షాడో కూడా ఒకటి. ఆ సంవత్సరంలో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుంది భారత క్రికెట్ జట్టు.

ICC World Cup

ఇప్పుడు మరో డిజాస్టర్‌ను ఇచ్చాడు మెహర్ రమేష్. ఈ సారి భోళా శంకర్ రూపంలో మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో పడిందా ఫ్లాప్. విడుదలైన రెండో రోజే థియేటర్లన్నీ ఖాళీగా కనిపించాయి. వాల్తేర్ వీరయ్య ఫర్వాలేదనిపించినప్పటికీ.. ఆచార్య, గాడ్ ఫాదర్ తరహాలోనే భోళా శంకర్ కూడా అభిమానులను నిరుత్సాహ పరిచింది.

భోళా శంకర్ విడుదలైన ఈ ఏడాదే టీమిండియా ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను ఆడబోతోంది. శక్తి, షాడో సినిమాలు విడుదలైన సంవత్సరాల్లో ఐసీసీ ట్రోఫీలను భారత్ గెలుచుకున్న ఆనవాయితీని పరిగణనలోకి తీసుకుంటే.. భోళా శంకర్ విడుదలైన ఈ సంవత్సరం జరిగే ఐసీసీ వరల్డ్ కప్‌ టోర్నమెంట్‌లో భారత్ గెలవడం ఖాయమైనట్టే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+