వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు..!!

వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. ఆయన్ను వెంటనే నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు.

వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. ఆయన్ను వెంటనే నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. గుండె సంబంధిత సమస్యలు రావటంతో ఆయన్ను వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండు వాల్వులు మూసుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే చికిత్స ప్రారంభించారు. మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యేను చెన్నైకి తరలించారు. నిపుణులైన వైద్యుల టీం ఆయన ఆరోగ్యాన్ని పరీక్షిస్తోంది.

నెల్లూరు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి గుండెపోటతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఛాతీలో నొప్పి..శ్వాస తీసుకోవటంలో అసౌకర్యంగా ఉండటంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ యాంజీయో పరీక్షలు చేయగా గుండె లో రెండు వాల్వులు మూసుకుపోయినట్లుగా నిర్దారించారు. మెరుగైన చికిత్స కోసం అపోలోకు తరలిస్తున్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

YSRCP MLA Mekapati Chandra Sekhar Reddy suffered a heart attack and was immediately shifted him to Hospital

2004,2009లో కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో జగన్ పార్టీ ఏర్పాటు తరువాత మేకపాటి సోదరులు ఇద్దరూ జగన్ కు మద్దతుగా నిలిచారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు ఎంపీగా.. చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత 2014 లో ఓడిపోగా, 2019 ఎన్నికల్లోనూ చంద్రశేఖర్ రెడ్డి తిరిగి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

నెల్లూరు జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం మేకపాటి కీలక వ్యాఖ్యలు చేసారు. తన నియోజకవర్గానికి సంబంధించి పార్టీ పరిశీలకుడి పైన కామెంట్స్ చేసారు. దీంతో.. పార్టీ అధినాయకత్వం ఉదయగిరి పరిశీలకుడిగా ఉన్న కొడవలూరు ధనుంజయ రెడ్డిని తొలగించింది. ఆయన స్థానంలో మెట్టుకూరు ధనుంజయ రెడ్డిని నియమించింది.

YSRCP MLA Mekapati Chandra Sekhar Reddy suffered a heart attack and was immediately shifted him to Hospital

చంద్రశేఖర్ రెడ్డి గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటూ తాజాగా బిల్లులు చెల్లింపు..ప్రభుత్వ నిధుల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. నెల్లూరులో మారుతున్న రాజకీయ సమీకరణల నడమ వైసీపీ జిల్లాలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక, ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థతకు గురికా.. వైద్యులు ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+