మేకపాటి కొత్త రాజకీయం - చంద్రశేఖరరెడ్డికి షాక్..!!
నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు రెబల్స్ గా మారారు. ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ పట్టు కొనసాగించే ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసారనే కారణంతో ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీసీ సస్పెండ్ చేసింది. అందులో రెండు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను నియమించింది. ఇప్పడుు ఆత్మకూరు నియోజకవర్గంపైన ఫోకస్ చేసింది. మేకపాటి రాజమోహన్ రెడ్డి.. ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అక్కడ ఇప్పుడు కొత్త రాజకీయం మొదలు పెట్టారు.
నెల్లూరులో మారుతున్న రాజకీయం : నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానంలో వెంకటగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో వైసీపీ కొత్త ఇంఛార్జ్ లుగా నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఆత్మకూరు విషయంలో మాత్రం పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నా ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

మేకపాటి చంద్రశేఖరరెడ్డి పార్టీకి వ్యతిరేకం గా వ్యవహరించటం పైన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. సీఎం జగన్ తోనే కలిసి నడుస్తామని రాజమోహన్ రెడ్డితో పాటుగా ఎంపీ విక్రమ్ రెడ్డి స్పష్టం చేసారు. ఇప్పుడు మేకపాటి కుటుంబానికి కోటగా ఉన్న ఆత్మకూరులో తమ పట్టు నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఆత్మకూరు పై మేకపాటి ఫోకస్ : ఆత్మకూరుకు చెందిన టీడీపీ నేత జడ్పీ మాజీ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఇప్పుడు తిరిగి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే రాఘవేంద్రరెడ్డితో మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి చర్చలు జరిపారు. గత కొంత కాలంగా టీడీపీ కార్యక్రమాలకు బొమ్మిరెడ్డి దూరంగా ఉంటున్నారు.
గతంలో బొమ్మిరెడ్డి వైసీపీ నుంచి వెంటగిరి టికెట్ ఆశించారు. తొలి నుంచి ఆనం వర్గంలో కీలకంగా పని చేసిన బొమ్మిరెడ్డి వైసీపీ టికెట్ దక్కకపోవటంతో టీడీపీలో చేరారు. ఆత్మకూరు సీటు పైన ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ నుంచి దీని పైన హామీ దక్కలేదు. గతంలో పీఆర్పీ నుంచి పని చేసారు. ఇప్పుడు తిరిగి వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. ఇందులో మేకపాటి రాజమోహన్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

వైసీపీలోకి టీడీపీ నేతల ఎంట్రీ : మేకపాటి చంద్రశేఖరరెడ్డి వైసీపీకి దాదాపు దూరం అయ్యారు. చంద్రశేఖరరెడ్డి వ్యవహరించిన తీరు పైన రాజమోహన్ రెడ్డి తప్పు బట్టారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి సూచనల మేరకే అక్కడ కొత్త ఇంఛార్జ్ ను నియమించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, సీఎం జగన్ ఇంకా ఎవరి విషయంలోనూ నిర్ణయం తీసుకోలేదు.
ఇదే సమయంలొ మేకపాటి రాజమొహన్ రెడ్డి నియోజకవర్గంలో టీడీపీ నేతలను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రానున్న రోజుల్లో మరిన్ని చేరికల తరువాత కొత్త ఇంఛార్జ్ తో సహా ఆత్మకూరుకు సంబంధించి వైసీపీ అధినాయకత్వం కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. రాజమోహన్ రెడ్డి వేగంగా వేస్తున్న అడుగులు ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డికి షాక్ గా మారుతున్నాయి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications