విజయవాడ సెంటర్‌లో తేల్చుకుందాం రా!: బాబుకు సవాల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీపై చర్చించడానికి,

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీపై చర్చించడానికి, విమర్శించడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి అర్హత లేదని అన్నారు.

కార్యకర్తల నుంచి నాయకుల వరకు అన్ని అంశాలపై చర్చించుకునే అవకాశాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవడంతో వాటన్నింటినీ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఖండిస్తున్నామని, ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు. ఈ మాత్రం దానికే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.

Meruga fires at Chandrababu

మంత్రులు దేవినేని ఉమ, జవహర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అసలు వీరికి ఏం అర్హత ఉందని నిలదీశారు. దళితులను వెలివేస్తే మాట్లాడని జవహర్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేవినేని ఉమ.. కృష్ణా, గుంటూరు, జిల్లాలలో పాల్పడుతున్న అవినీతి ప్రతిఒక్కరికీ తెలుసని చెప్పారు.

జగన్మోహన్ రెడ్డిపై అవాకులు, చవాకులు ఆపి దమ్ముంటే బహిరంగ చర్చకు రండి, విజయవాడ నడిరోడ్డున తేల్చుకుందామని మేరుగ నాగార్జున సవాల్ విసిరారు. తమ పార్టీలోని ఏ ఒక్కరైనా వచ్చి సమాధానం చెప్పి తీరుతామన్నారు. రాష్ట్రంలో దళితులను వెలివేస్తుంటే అక్కడకు వెళ్లడం చేతగానీచంద్రబాబు సర్కారుకు.. ఏం అర్హత ఉందని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

వైయస్ జగన్ ఇచ్చిన 9వాగ్ధానాలను ఖచ్చితంగా ప్రతి ఇంటికీ తీసుకెళతామని స్పష్టం చేశారు. 600 వాగ్ధానాలు ఇచ్చి ఆరు కూడా అమలు చేయలేని నిస్సహాయత చంద్రబాబు ధ్వజమెత్తారు. త్వరలోనే టీడీపీని పతనం ఖాయమని జోస్యం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+