నాగచైతన్య చూడటానికి చాలా బాగుంటాడు.. కానీ నేను టచ్ లో నేను!!
పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్' ప్రమోషన్స్‌లో భాగంగా నటి దివ్యాన్ష కౌశిక్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు
'మజిలీ' సినిమాతో తెలుగువారికి పరిచయమైన ఉత్తరాఖండ్ బ్యూటీ దివ్యాన్ష కౌశిక్. ఈ సినిమాలో ఆమె నాగచైతన్యకు ప్రియురాలిగా నటించారు. ఈ క్రమంలోనే దివ్యాన్ష చైతన్యతో రిలేషన్‌లో ఉందని, త్వరలోనే పెళ్లిచేసుకోబోతున్నారంటూ గతేడాడే వార్తలు వచ్చాయి. వీటిపై ఆమె స్పందించారు. ''నాగచైతన్య అంటే నాకెంతో ఇష్టం.. నా సీనియర్‌గా భావిస్తాను.. వృత్తిపరంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటాను.. మా ఇద్దరి గురించి అలాంటి వార్తలు నేను వినలేదు.. ఈ మధ్యకాలంలో మేమిద్దరం మాట్లాడుకున్నది కూడా లేదు'' అని దివ్యాన్ష కౌశిక్ తెలిపారు.

నా క్రష్.. ఆదిత్య రాయ్ కపూర్
తన సెలబ్రిటీ క్రష్ గురించి చెబుతూ తనకు విజయ్ దేవరకొండ అంటే ఎంతో ఇష్టమని, 'అర్జున్ రెడ్డి' చూసిన తర్వాత ఆయనపై క్రష్ ఏర్పడిందని తెలిపారు. ఈ మధ్యకాలంలో అమ్మాయిలంతా ఆయన్నే ఇష్టపడుతుండటంతో మనసు మార్చుకున్నానన్నారు. ఇప్పుడు తన క్రష్ ఆదిత్య రాయ్ కపూర్ అని చెప్పారు. కెరీర్ విషయానికి వస్తే.. 'మజిలీ' తర్వాత దివ్యాన్ష 'ది వైఫ్', 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాల్లో పనిచేశారు. ఆ రెండూ మిశ్రమ స్పందనలే తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ సందీప్ కిషన్‌కు జోడీగా 'మైఖేల్'లో నటించారు. వచ్చే నెలలో ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

పెళ్లైన యంగ్ బ్యాచిలర్స్ జాబితాలో నాగ చైతన్య
సమంతని ప్రేమించి పెళ్లాడిన నాగ చైతన్య.. పరస్పర అవగాహన, అనుమతితో తమ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. సమంతే నాగచైతన్యని వద్దనుకుందో.. లేదంటే.. నాగ చైతన్యే వద్దనుకున్నాడో తెలియదుకానీ ఇద్దరూ విడిపోయారు. దీంతో మళ్లీ నాగాచైతన్య పెళ్లైన యంగ్ బ్యాచ్‌లర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. దీంతో నాగచైతన్య ఏ కథానాయికతో కాస్త క్లోజ్‌గా ఉన్నా ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉందంటూ పుకార్లు వస్తున్నాయి. యంగ్ హీరోయిన్, తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ తో నాగ చైతన్య డేటింగ్‌లో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరూ జూబ్లీహిల్స్‌లో ఓ కొత్త ఇంటిలోకి మారబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే అకస్మాత్తుగా 'మజిలీ' బ్యూటీ దివ్యాంశ కౌశిక్ వార్తల్లోకి నిలిచింది. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నాగచైతన్య వల్లే అవకాశం లభించిందని ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని ఆమె ఖండించారు.

రూమర్లంటూ ఖండించిన దివ్యాన్ష
తాజా ఇంటర్వ్యూలో దివ్యాన్ష మాట్లాడుతూ.. 'ఐ లవ్ నాగ చైతన్య.. అతనిపై క్రష్ ఉంది.. చూడ్డానికి చాలా బాగుంటారు అంది. అలాగని తమ మధ్య ఏదో ఉందని అనుకుంటే అంతకంటే పొరపాటు ఏదీ ఉండదన్నారు. తమ మధ్య అలాంటిదేమీ లేదని, ఎవరి బిజీలో వాళ్లు ఉండిపోయామన్నారు. తాము వివాహం చేసుకుంటున్నామంటూ వచ్చిన వార్తలన్నీ రూమర్లని, నాగచైతన్య ఇండస్ట్రీలో హెల్ప్ చేస్తున్నాడని.. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో ఛాన్స్ రావడానికి కూడా కారణం అతనేనని వచ్చిన రూమర్లు కూడా నిజం కాదు' అని దివ్యాన్ష కౌశిక్ స్పష్టంగా చెప్పింది.












Click it and Unblock the Notifications