దేవాన్ష్‌ను ఎత్తుకొని.. బాబు ఫ్యామిలీతో సరదాగా సత్య నాదెళ్ల, లోకేష్ థ్రిల్ (ఫోటో)
హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్‌తో ఆడుకున్నారు. సత్య నాదెళ్ల.. దేవాన్ష్‌ను ఎత్తుకొని ముద్దు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబంతో సరదాగా గడిపారు.
సత్య నాదెళ్లతో భేటీ అనంతరం చంద్రబాబు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేశారు. సత్య నాదెళ్లతో భేటీ ద్వారా తనకు ఈ రోజు గొప్పగా ప్రారంభమైందని, భేటీలో టెక్నాలజీ, ఏపీతో మైక్రోసాఫ్ట్ ఒప్పందాలు తదితరాలపై చర్చించామన్నారు.
నారా లోకేష్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. సత్య నాదెళ్లను కలవడం థ్రిల్‌గా ఫీలయ్యానని, టిడిపికి సాంకేతిక సహకారం విషయంలో చర్చించానని పేర్కొన్నారు. దేవాన్ష్‌తో సత్య నాదెళ్ల సరదాగా గడిపాడని పేర్కొన్నారు.
Devaansh got pretty comfortable with Microsoft CEO @satyanadella who had his share of fun moments & pampered him. pic.twitter.com/5eUDnuzSEr
— Lokesh Nara (@naralokesh) December 28, 2015 అంతకుముందు చంద్రబాబు, సత్యనాదెళ్లలు భేటీ అయిన విషయం తెలిసిందే. చంద్రబాబు నివాసంలో దాదాపు గంటన్నర పాటు వీరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సత్య నాదెళ్లకు చంద్రబాబు అల్పాహార విందు ఇచ్చారు.
చంద్రబాబు, సత్య నాదెళ్లల భేటీ సందర్భంగా.. విద్య, వ్యవసాయం రంగాల్లో మెరుగైన అభివృద్ధి, సమాచార సేకరణ, విశ్లేషణ, ముందస్తు అంచనాల కోసం మైక్రోసాఫ్ట్‌తో ఏపీ ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. దీంతో పాటు పలు అంశాలపై ఇరువురు చర్చించారు.












Click it and Unblock the Notifications