అర్దరాత్రి భేటీ : చంద్రబాబు తో రాధా సమావేశం : లగడపాటి రాయబారం..!
Recommended Video

ముఖ్యమంత్రి చంద్రాబు తో వంగవీటి రాధా అర్దరాత్రి సమావేశం అయ్యారు. కొద్ది రోజుల క్రితం వైసిపికి రాజీనామా చేసిన వంగవీటి రాధా అప్పట్లోనే టిడిపి లో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే, అనుచరుల నుండి వచ్చిన సూచనల తో రాధా ఆ ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నారు. తాజాగా, లగడపాటి రాజగోపాల్ రాయబారం తో అర్దరాత్రి భేటీ జరిగింది. దీంతో..ఇప్పుడు రాధా టిడిపిలోకి అధికారిక ఎంట్రీయే మిగిలి ఉంది.
చంద్రబాబు తో భేటీ..
వైసిపిని వీడే సమయంలో జగన్ పై తీవ్ర ఆరోపణలు చేసిన వంగవీటి రాధా అప్పట్లోనే టిడిపి లో చేరుతారనే ప్రచారం జరిగింది. టిడిపి నేతలు సైతం రాధా నివాసానికి వెళ్లి పార్టీ లోకి ఆహ్వానించారు. అయినా..రాధా టిడిపి లో చేరే అంశం పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే, ఎన్నికల షెడ్యూల్ రావటం ..టిక్కెట్ల ఖరారు పూర్త కావస్తుండటంతో రాధా చేరిక విషయం లో స్పష్టత కోసం లగడపాటి మధ్య వర్తిత్వం నిర్వహించారు. ఆయన ఇప్పటికే రెండు సార్లు రాధాతో భేటీ అయ్యారు.
తాజా ఎన్నికల్లో ఆయనకు విజయవాడ నగరం లోని మూడు సీట్లలో టిడిపి నుండి ఇచ్చే అవకాశం లేదు. ఇప్పటికే మూడు సీట్ల కు అభ్యర్ధులను టిడిపి ఖరారు చేసింది. అయితే, విజయవాడ సెంట్రల్ పై ఆలోచన చేయాలని రాధా ఈ చర్చల్లో భాగం గా కోరినట్లు విశ్వసనీయ సమాచారం. టిడిపి మాత్రం ఆయనకు ఎమ్మెల్సీ సీటు పై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికట్లో టిడిపికి అనుకూలంగా ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.

జగన్ లక్ష్యంగా...
వైసిపి ని వీడే సమయంలో వంగవీటి రాధా వైసిపి అధినేత జగన్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధా సేవలను వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రధానంగా కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రాధా తో ప్రచారం చేయించాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నా రు. జగన్ తనను అవమానించారంటూ రాధా ప్రచారం చేయటం ద్వారా కాపు సామాజిక వర్గంలో ఆయన పై వ్యతిరేకత పెరిగేలా వ్యవహరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రాధా ఇక టిడిపిలో చేరటం పైనా చర్చ జరి గింది.
ఆయన ఈ రోజు లేదా రేపు టిడిపిలో చేరుతారని చెబుతున్నారు. ఇదే సమయంలో రాధా ను విజయవాడ కాక పోయినా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ స్థానం ఇచ్చినా పోటీ చేయటానికి రాధా సంసిద్దత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో.. ఈ రోజు లేదా రేపు వంగవీటి రాధా టిడిపిలో చేరటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications