ఏపిలో జ‌గ‌న్ కు మ‌ద్ద‌తిస్తా: నా ప్ర‌భావం ఏంటో బాబుకు చూపిస్తా : అస‌ద్ కీల‌క నిర్ణ‌యం..

Recommended Video

    AP Elections 2019 : Asaduddin Owaisi Anounced His Support For YS Jagan | Oneindia Telugu

    తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి కావ‌టంతో..ఇప్పుడు ఏపి లో చంద్ర‌బాబు ను ల‌క్ష్యంగా చేసుకొని కీల‌క నేత‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. చంద్ర‌బాబు త‌మ‌కు వ్య‌తిరేకంగా తెలంగాణ లో ప్ర‌చారం చేసార‌ని..తాము కూడా చంద్ర‌బాబు కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తామ‌ని కెసిర్ స్ప‌ష్టం చేసారు. ఏపిలో ఖచ్చితంగా వేలు పెడ‌తామ‌ని కెటిఆర్ తేల్చి చెప్పారు. తాజాగా వారి బాట‌లోనే మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ సైతం చేరారు. చంద్ర‌బాబు కు ఏపిలో త‌న స‌త్తా చాటుతానంటూనే జ‌గ‌న్ కు మ‌ద్ద‌తిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఏపిలో ఇది హాట్ టాపిక్ గా మారింది..

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018లో గెలిచిన అభ్యర్థులు (ఫోటోలు)

    హైద‌రాబాద్ కేంద్రంగా ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై టిఆర్‌య‌స్‌- మ‌జ్లిస్ పార్టీల అధినేత‌లు ఫైర్ అవుతున్నా రు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టిఆర్‌యస్ గెలుస్తుంద‌ని ముందు నుండి ఆ పార్టీ నేత‌లే చెబుతున్నారు. కెసిఆర్ ఒంట‌రిగానే తెలంగాణ లో పూర్తి మెజార్టీ సాధిస్తార‌ని మిత్ర‌ప‌క్షంగా ఉన్న మ‌జ్లిస్ అధినేత జోస్యం చెప్పారు. దీనికి అను గుణంగానే ఫ‌లితాలు వ‌చ్చాయి. టిఆర్‌య‌స్ - ఎంఐఎం అధినేతలు ఇద్ద‌రూ చంద్ర‌బాబు ను ల‌క్ష్యం గా చేసుకున్న‌ట్లు గా స్ప‌ష్టం అవుతోంది. ఇందులో భాగంగానే..కెసిఆర్‌..కెటిఆర్ ప్ర‌క‌ట‌న‌ల‌కు కొన‌సాగింపుగా తాజాగా..ఎంఐఎం అధినేత అస‌ద్ సైతం కీల‌క ప్ర‌క‌ట‌న చేసారు. తాను ఏపికి వెళ్లి జ‌గ‌న్ కు మ‌ద్ద‌తిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఏపి సీయం చంద్ర‌బాబు కు సొంత రాష్ట్రంలోనే వ్య‌తిరేక‌త ఉంద‌ని పేర్కొన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి రెండు స్థానాల్లో కూడా గెల‌వ‌లేద‌ని అస‌ద్ వ్యాఖ్యానించారు. కోట్లు ఖ‌ర్చు చేసి ప్ర‌చారం చేసినా..తెలంగాణ‌లో చంద్ర‌బాబు ఫ‌లితాలు సాధించ‌లేక‌పోయా ర‌ని ఆరోపించారు. ఏపి లో తాను ప్ర‌చారం చేస్తే ప్ర‌భావం ఎలా ఉంటుందో చంద్ర‌బాబుకు తెలుస్తుంద‌ని అస‌ద్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌న గా మారాయి.

    MIM Chief announced open support for Jagan in AP : He politicall target Chandra Babu..

    ఏపిలో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌స్లిం మైనార్టీల ప్ర‌భావం ఉంది. తెలంగాణ లో కాంగ్రెస్ తో చేతులు క‌లిపి టిఆర్‌య‌స్ - ఎంఐఎం కు వ్య‌తిరేకంగా ప‌ని చేసిన చంద్ర‌బాబు ను ఏపిలో టార్గెట్ చేయాల‌ని అస‌ద్ భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇందులో భాగంగా..ఏపిలో తాను జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తాన‌ని బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు.

    గ‌త ఎన్నిక‌ల్లో బిజెపితో పొత్తు కార‌ణంగా టిడిపి కేవ‌లం ఒక సీటు మాత్ర‌మే ముస్లిం ల‌కు కేటాయించింది. మంత్రివ‌ర్గంలోనూ గ‌త నెల వ‌ర‌కూ ముస్లిం ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. ఇక‌, ఇప్పుడు బిజెపి పై వ్య‌తిరేక‌త‌- కాంగ్రెస్ తో స‌ఖ్య‌త కార‌ణంగా త‌మ‌కు ముస్లింలు తిరిగి ద‌గ్గ‌ర‌వుతార‌ని టిడిపి అంచనా వేస్తోంది. ఇక‌, ముస్లిం- మైనార్ట‌ల పార్టీగా పేరున్న మ‌జ్లిస్ అధినేత స్వ‌యంగా ఏపిలో ప్ర‌చారంలోకి దిగితే..మ‌రి వారి ఓట్ బ్యాంక్ టిడిపికి వ్య‌తిరేకంగా.. వైసిపి కి అనుకూలంగా ఎంత వ‌ర‌కు మ‌ళ్లించ‌గ‌లుగుతార‌నేది ఆస‌క్తి క‌రంగా మారింది.

    MIM Chief announced open support for Jagan in AP : He politicall target Chandra Babu..
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+