వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు సిట్టింగ్‌లకు అసదుద్దీన్ మొండిచేయి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మజ్లీస్ పార్టీ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పార్టీకి ఏడుగురు శాసనసభ్యులు ఉన్నారు. వీరిలో ఇద్దరికి తప్ప మిగతా ఐదుగురికీ సీట్లు ఖరారయ్యాయి. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తొలి జాబితాను సోమవారం విడుదల చేశారు. హైదరాబాదులోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాసత్ రసూల్‌ఖాన్‌ను తప్పించి ఆయన స్థానంలో జిహెచ్‌ఎంసి మాజీ డిప్యూటీ మేయర్ జాఫర్ హుస్సేన్ మీరాజ్‌కు కేటాయించారు.

కార్వాన్ ఎమ్మెల్యే అఫ్సర్ ఖాన్‌ను తప్పించి కౌసర్ మోహియుద్దీన్‌కు ఇచ్చారు. మిగతా నియోజకవర్గాల్లో తిరిగి వారికే టిక్కెట్లు ఇచ్చారు. యాకుత్‌పురా నుంచి ముంజాత్ ఖాన్, చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, బహదూర్‌పురా నుంచి మొజంఖాన్, చార్మినార్ నుంచి అహ్మద్ పాషా ఖాద్రీ, మలక్‌పేట నుంచి అహ్మద్ బలాల పోటీ చేస్తారు.

విధేయతకు మజ్లీస్ తొలి జాబితాలో ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. హైదరాబాదు పార్లమెంటు సీటు నుంచి తానే పోటీ చేస్తానని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కూడా పొత్తు కుదరలేదని ఆయన అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఏ పార్టీతో వెళ్లాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

రెండో విడత సికింద్రాబాద్ లోకసభ స్థానానికి, తెలంగాణలోని అంబర్‌పేట, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, నిజామాబాద్, బోదన్, ఆర్మూర్ అసెంబ్లీ స్థానాలకు రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

హైదరాబాద్ షాహెన్ షా...

హైదరాబాద్ షాహెన్ షా...

తాను తిరిగి హైదరాబాద్ లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తానని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.

విధేయతకే పెద్ద పీట..

విధేయతకే పెద్ద పీట..

సోమవారం విడుదల చేసిన శాసనసభ అభ్యర్థుల తొలి జాబితాలో అసదుద్దీన్ ఓవైసీ విధేయతకే పెద్ద పీట వేసినట్లు కనిపిస్తున్నారు.

కౌసర్ జాక్‌పాట్..

కౌసర్ జాక్‌పాట్..

కార్వాన్ శానససభ నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అఫ్సర్ ఖాన్‌ను పక్కన పెట్టి కౌసర్‌కు టికెట్ ఇచ్చారు.

నాంపల్లికి కూడా కొత్త అభ్యర్థి

నాంపల్లికి కూడా కొత్త అభ్యర్థి

నాంపల్లి నియోజకవర్గంలో సిట్టింగ్ శాసనసభ్యుడు విరాసత్ రసూల్ ఖాన్‌ను పక్కన పెట్టి జాఫర్ హుస్సేన్ మిరాజ్‌కు (ఎడమపక్కన) టికెట్ కేటాయించారు.

పనితీరుపై అసంతృప్తి

పనితీరుపై అసంతృప్తి

ప్రస్తుత శాసనసభ్యుడు విరాసత్ రసూల్ ఖాన్ పనితీరు పట్ల మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయనను తప్పించినట్లు సమాచారం.

English summary

 The All India Majlis Ittehadul Muslimeen on Monday announced its first list of candidates for seven Assembly constituencies and the Hyderabad LS seat for which polling is scheduled in the first phase of elections on April 30.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X